G. V. Prakash Kumar : దీపావళితో ఒకేరోజు రెండు హిట్స్ కొట్టిన జి.వి. ప్రకాష్..

G V Prakash Kumar two hits on the same day with Diwali

G. V. Prakash Kumar : మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాష్ కుమార్ కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా హీరోగా, నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ లో ఇప్పుడున్న చాలా మంది డైరెక్టర్స్ సరికొత్త ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కోసం వెతుకుతున్నారు. టాలీవుడ్ లో థమన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికి జి.వి. ప్రకాష్ కి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

అయితే తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అందించిన అమరన్, లక్కీ భాస్కర్ రెండు సినిమాలు ఒకేసారి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీపావళి సందర్బంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలతో జి.వి. ప్రకాష్ కి మంచి సక్సెస్ వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే లక్కీ భాస్కర్ సినిమాకి ఆయన అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అలాగే అమరన్ కి ఇచ్చిన బిజిఎం కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది.

Also Read : Shah Rukh Khan : ఏంటి.. షారుఖ్ మన్నత్ వెనక అంత కథ ఉందా.. పాపం దానికోసం ఎంత కష్టపడ్డాడో..

దీంతో తనకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కా, నితిన్ రాబిల్ హుడ్ సినిమాకి మ్యూజిక్ అందించారు. మట్కా డైరెక్టర్ కూడా జి.వి. ప్రకాష్ ఈ సినిమాకి అందించిన బీజీమ్ బాగుంటుందని, ఇలాంటి సినిమాలు తను మరెన్నో చెయ్యాలని అన్నారు. మొత్తానికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకోవడంతో హ్యాపీ గా ఉన్నారు జి.వి. ప్రకాష్.