Shah Rukh Khan : ఏంటి.. షారుఖ్ మన్నత్ వెనక అంత కథ ఉందా.. పాపం దానికోసం ఎంత కష్టపడ్డాడో..

Shah Rukh Khan : ఏంటి.. షారుఖ్ మన్నత్ వెనక అంత కథ ఉందా.. పాపం దానికోసం ఎంత కష్టపడ్డాడో..

story behind Shah Rukh Khan house Mannat

Updated On : November 4, 2024 / 4:55 PM IST

Shah Rukh Khan : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ క్రేజ్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ కి కూడా పాకింది.అయితే షారుఖ్ అత్యధిక ఆస్థిపరుల్లో ఒకరిని చెప్పొచ్చు. అంతేకాదు ఇటీవల జరిగిన ఓ సర్వే లో కూడా షారుఖ్ ఆస్తులు 7300 కోట్లకు పైమాటే అని తెలిపింది. కేవలం సినిమాలతోనే కాకుండా నిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్‌ వంటి వాటితో కూడా కోట్లల్లో కూడబెట్టాడు షారుఖ్.

అయితే ఇటీవల ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మన్నత్ ను ఎలా కొన్నారు. ఇంత అందంగా ఎలా మార్చుకున్నారో చెప్పారు. కెరీర్ ప్రారంభిస్తున్న సమయంలో షారుఖ్ ఓ బంగ్లా కొన్నాడు. ఎంతో ఇష్టంతో దాన్ని తనకి నచ్చినట్టు మార్చుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ముంబైలో ఇళ్ళు చాలా ఖరీదైనవి, ఇక్కడికి వచ్చే వరకు నాకు ఆ విషయం తెలీదు. నేను సినిమాలు చేస్తున్న సమయంలో డైరెక్టర్స్ నన్ను ముంబైలోనే ఉండాలని చెప్పేవారు. ఇక్కడైతేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పడంతో మన్నత్ కొన్నాను. నేను మన్నత్ కొన్న సమయంలో అది అస్సలు బాలేదు. కానీ దాన్ని సరిచేయించటానికి డబ్బులు లేవు.

Also Read : Bigg Boss 8 : నామినేషన్స్ విషయంలో హౌస్ మేట్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. ఎప్పుడూ ఇద్దరు.. ఇప్పుడు ఒక్కరే..

ఎలాగో అలా ఉన్న డబ్బుల్లో సరిచేయించాలని ఒక ఇంటీరియర్ డిజైనర్ ని పిలిస్తే ఆయన నా నెల జీతం ఒకేసారి అడిగారు. అంత డబ్బు నేను ఇవ్వలేక నా భార్యకి చెప్పాను..గౌరీ నీకు ఈ విషయంలో చాలా ట్యాలెంట్ ఉంది నువ్వే ఎందుకు ఈ ఇంటిని మార్చకూడదు అని చెప్పి.. అప్పటి నుండి నాకు వచ్చిన డబ్బులో కొంత కొంత కూడబెట్టి.. కొద్ది కొద్దిగా ఇంటి పనులను పూర్తి చేసాం. అలా డబ్బు ఉన్నప్పుడు సోఫాలు, అన్ని సామాన్లు తెచుకున్నామని తెలిపాడు షారుఖ్.