Galata Geethu
Casting Couch : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలలో తన చిత్తూరు యాసతో ఫేమస్ తెచ్చుకుంది చిత్తూరు అమ్మాయి గలాటా గీతూ. తనకి వచ్చిన ఫేమ్ తో టీవీ షోలలోకి కూడా ఎంటర్ అయింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తూ మరింత ఫేమ్, డబ్బులు సంపాదిస్తుంది గీతూ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది.
గలాటా గీతూ మాట్లాడుతూ.. ”నాకు మాట్లాడటం ఇష్టం అందుకే ఆర్జే అవ్వాలనుకున్నాను. ఇటీవల కొన్ని పెద్ద బ్యానర్‌వాళ్లు సినిమాల్లో క్యారెక్టర్స్ కి అడిగారు కానీ నాకు అంతగా యాక్టింగ్ రాదు అని చెప్పాను. చిన్న చిన్న సినిమాల్లో మాత్రం తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేశాను. క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఇటీవలే ఓ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ ఉంది, దానికి హోస్ట్ చేయాలని ఒకరు అడిగారు. నాకు హోస్టింగ్ అంటే ఇష్టమని ఓకే చెప్పాను.
F3 Movie : F3 మూవీ ఓటీటీలో వచ్చేది అప్పుడే.. వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..
ఆస్ట్రేలియాలో కాబట్టి రెమ్యునరేషన్ కూడా భారీగానే ఇస్తామన్నారు. అంతా ఓకే అయ్యాక టికెట్ బుక్ చేసే సమయంలో మీకు, మా మేనేజర్‌కు పర్సనల్‌గా ఓకే అయితే ఇంకా ఎక్కువ డబ్బులిస్తాం అని ఈవెంట్ మేనేజర్ పిఎ అడిగాడు. దీంతో నేను షాక్ కి గురయ్యాను. వెంటనే నో చెప్పి ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ తర్వాత కూడా వాళ్ళు ఫోన్స్ చేసి పర్సనల్‌గా కాకపోయినా కనీసం హోస్టింగ్ అయినా చేయండి అని అడుగుతూనే ఉన్నారు. అయినా నో చెప్పేసి నంబర్స్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసాను” అని తెలిపింది. తాజాగా ఈ విషయం బయటకి రావడంతో మరోసారి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై చర్చ మొదలైంది.