Game Changer : మళ్లీ వాయిదా పడ్డ ‘గేమ్ ఛేంజర్’..?

చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మొదట సెప్టెంబర్‌లో విడుదల అన్న మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని మరింత డ్రాగ్ చేస్తున్నారు.

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మళ్లీ వాయిదా పడ్డట్లేనా? ఈ ఏడాది డిసెంబర్ లేదా 2025 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

Gaami Teaser : గామి టీజర్ చూశారా? విశ్వక్ వల్ల అవుతుందా?

రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ తేదీ ఇంకా కన్ఫామ్ కాలేదు. కొన్ని నెలల క్రితం సెప్టెంబర్ చివరి వారంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. మరల ఇప్పుడు డిసెంబర్‌‌లో ఈ మూవీ విడుదల ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ దేవర మొదట ఏప్రిల్ 5న  రిలీజ్ ప్రకటించిన టీమ్ మళ్లీ డేట్ మార్చి అక్టోబర్ 10 కి విడుదల తేదీ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ టైంకి గేమ్ ఛేంజర్ విడుదల అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పటికే చిరంజీవి విశ్వంభర, నాగార్జున బంగార్రాజు 2, వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలు కూడా వరుసలో ఉండటంతో గేమ్ ఛేంజర్ డిసెంబర్ గడువును కోల్పోతే 2025 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Vishwak Sen : విశ్వక్ సేన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఒకే ఒక్క సినిమా.. ఏంటో తెలుసా?

గేమ్ ఛేంజర్ సినిమాకి ఇంకా 3 నెలల షూటింగ్ మిగిలి ఉందట. త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 2024 కి కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై రెండు నెలల క్రితం శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు మీటింగ్ అయ్యారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో 4,5 నెలల సమయం పడుతుంది కాబట్టి 2024 డిసెంబర్‌లో విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ, అంజలీ, శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు