Gaami Teaser : గామి టీజర్ చూశారా? విశ్వక్ వల్ల అవుతుందా?

విశ్వక్ సేన్ అఘోరగా నటిస్తున్న 'గామి' సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

Gaami Teaser : గామి టీజర్ చూశారా? విశ్వక్ వల్ల అవుతుందా?

Vishwak Sen Gaami Movie Teaser Released

Updated On : February 17, 2024 / 11:42 AM IST

Characters of Gaami Teaser : విశ్వక్ సేన్(Vishwak Sen) అఘోరగా నటిస్తున్న ‘గామి’ సినిమా నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. మార్చి 8న గామి సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మూవీ యూనిట్. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న గామి సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇదే నీ సమస్యకు పరిష్కారం అంటూ ఓ మ్యాప్ చూపిస్తూ టీజర్ ని మొదలుపెట్టారు. చివర్లో అఘోరగా విశ్వక్ ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందా అని ప్రశ్నిస్తాడు. టీజర్ బట్టి చూస్తే ఓ అఘోరకు వచ్చిన సమస్యకు హిమాలయాల్లో పరిష్కారం దొరుకుతుందని మ్యాప్ పట్టుకొని దాని కోసం వెతకడానికి వెళ్తాడని తెలుస్తుంది.

Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఒకే ఒక్క సినిమా.. ఏంటో తెలుసా?

ఇక ఈ సినిమాని కాశీ, హిమాలయాల్లోని ఎక్కువ శాతం షూట్ చేసినట్టు సమాచారం. గామి ట్రైలర్ ని ఫిబ్రవరి 29న రిలీజ్ చేయనున్నారు.