Gandeevadhari Arjuna OTT : గాండీవ‌ధారి అర్జున ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌..! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) న‌టించిన చిత్రం గాండీవ‌ధారి అర్జున. ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌.

Gandeevadhari Arjuna OTT

Gandeevadhari Arjuna OTT Platform : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) న‌టించిన చిత్రం గాండీవ‌ధారి అర్జున. ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా నేడు (శుక్ర‌వారం ఆగ‌స్టు 25) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆడియ‌న్స్‌ నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

Samantha : మయోసైటిస్ బాధితులు కోసం రంగంలోకి దిగుతున్న సమంత..

ఇక ఓటీటీలో ఈ సినిమా ఏ ప్లాట్ ఫామ్‌లో వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్‌ప్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. విడుద‌ల‌కు ముందే ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే థియేట‌ర్ల‌లో విడుద‌లైన నాలుగు నుంచి ఆరు వారాల త‌రువాత కానుందని తెలుస్తోంది. అంటే ఈ లెక్క‌న అక్టోబ‌ర్ మొద‌టి వారం లేదా రెండో వారంలో రానుంది. తెలుగుతో పాటు మిగ‌తా బాష‌ల్లోనూ అదే రోజు స్ట్రీమింగ్ కానుంది.

Milind Safai : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. క్యాన్స‌ర్‌తో ప్ర‌ముఖ న‌టుడి మృతి

ఇదిలా ఉంటే.. కొత్త ద‌ర్శ‌కుడు శ‌క్తి ప్ర‌తాస్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. రియ‌ల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో వ‌రుణ్ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లోని జెట్ ఫైట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. హీరోయిన్‌గా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా రెనైసెన్స్ పిక్చర్స్ , సోని పిక్చర్స్ లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Jabardasth Shanthi : స‌ర్జ‌రీ కోసం.. ఇంటిని అమ్మేస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు

ట్రెండింగ్ వార్తలు