Samantha : మయోసైటిస్ బాధితులు కోసం రంగంలోకి దిగుతున్న సమంత..

మయోసైటిస్ పై అవగాహన కల్పించేందుకు, బాధ పడుతున్న వారిలో ధైర్యం నింపేందుకు, పోరాడుతున్న వారి జీవితాలకు తోడు ఉండేలా..

Samantha : మయోసైటిస్ బాధితులు కోసం రంగంలోకి దిగుతున్న సమంత..

Samantha is brand ambassador for Myositis India to bring awareness

Samantha : మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధి వల్ల బాధ పడుతున్న సమంత.. కొన్నాళ్ళు దాని గురించి ఎవరికి తెలియజేయకుండా తనలో తానే ఎంతో బాధ పడింది. అయితే కొన్ని రోజులు తరువాత తనలో ఒక సందేహం కలిగింది. ఇలా తనలా బాధ పడేవాళ్ళు చాలామంది ఉంటారు. తమలో తామే బాధ పడుతూ ఆ వ్యాధిని మరికొంచెం పెద్దది చేసుకుంటూ వెళ్తుంటారు. సెలబ్రిటీ హోదాలో ఉన్న తాను ధైర్యం చేసి దానిని అందరి ముందుకు తీసుకు వస్తే.. తనని చూసి సాధారణ ప్రజలు కూడా ఆ బాధని బయటకి చెప్పుకోగలుగుతారు, వారిలో ఉన్న కొంత దిగులు తీరుతుందని సమంతకి అనిపించింది.

Jabardasth Shanthi : స‌ర్జ‌రీ కోసం.. ఇంటిని అమ్మేస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు

అందుకనే ఒక అడుగు ముందుకు తీసుకోని బయటకి వచ్చి తన సమస్యని తెలియజేసింది. దీంతో ఆమెను స్ఫూర్తి పొంది అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న చాలామంది బయటకి తెలియజేయడం మొదలుపెట్టారు. ఈ విషయంపై పలువురు సమంతకి కృతజ్ఞతులు తెలియజేస్తూ కూడా వచ్చారు. ఇక తాజాగా సమంత మరో అడుగు ముందుకు వేస్తూ ఇంకో నిర్ణయం తీసుకుంది. మయోసైటిస్ పై అవగాహన కల్పించేందుకు, బాధ పడుతున్న వారిలో ధైర్యం నింపేందుకు, పోరాడుతున్న వారి జీవితాలకు తోడు ఉండేలా.. సమంత ‘మాయోసైటిస్ ఇండియా’కి బ్రాండ్ అంబాసడర్ గా మారబోతుంది.

Chandrabose : 20 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు చంద్రబోస్‌కి.. మొత్తం ఎంతమంది రచయితలకు..

ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇక సమంత నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఒక సమస్య పై అవగాహన కల్పించేందుకు సమంత తీసుకున్న నిర్ణయం హర్షించతగ్గ విషయం అంటూ కామెంట్స్ రూపంలో ఆమెకు తెలియజేస్తున్నారు. కాగా సమంత ప్రస్తుతం అమెరికాలో ఉంది. న్యూయార్క్ లో జరిగే 41వ భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన సమంత.. కొంత కాలం అక్కడే ఉండి చికిత్స తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరో పక్క సమంత నటించిన ఖుషి (Kushi) వచ్చే వారం సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Myositis India (@myositis_india)