Jabardasth Shanthi : స‌ర్జ‌రీ కోసం.. ఇంటిని అమ్మేస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శాంతి అలియాస్ శాంతి స్వ‌రూప్ (Shanthi Swaroop) ఒక‌రు.

Jabardasth Shanthi : స‌ర్జ‌రీ కోసం.. ఇంటిని అమ్మేస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు

Jabardasth Shanthi

Updated On : August 25, 2023 / 5:07 PM IST

Jabardasth Shanthi Swaroop : జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శాంతి అలియాస్ శాంతి స్వ‌రూప్ (Shanthi Swaroop) ఒక‌రు. చాలా మంది శాంతి స్వ‌రూప్ అంటే గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు గానీ జ‌బ‌ర్ద‌స్త్ శాంతి (Jabardasth Shanthi) అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. లేడి గెట‌ప్‌లో అత‌డికి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పైకి న‌వ్వుతూ క‌నిపిస్తూ అంద‌రిని న‌వ్విస్తున్న శాంతి స్వ‌రూప్ కు ఓ పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డింది.

Chandrabose : 20 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు చంద్రబోస్‌కి.. మొత్తం ఎంతమంది రచయితలకు..

ఆ మ‌ధ్య ఎంతో ఇష్ట‌ప‌డి ఓ ఇల్లు కొనుక్కున్నాను అంటూ అత‌డు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా అత‌డే స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఇల్లు అమ్మాల్సిన క‌ష్టం ఏం వ‌చ్చింద‌ని అనుకుంటున్నారా..? శాంతి స్వ‌రూప్ వాళ్ల అమ్మ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆమెకు శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం. స‌ర్జ‌రీ కోసం త‌న వ‌ద్ద డ‌బ్బు లేక‌పోవ‌డంతో ఇంటిని అమ్మేస్తున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా తెలిపాడు.

Kushi fifth Single : ఖుషి ఐదో సాంగ్ ప్రొమో.. ‘ఓసి పెళ్లామా’ అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఈ విష‌యం త‌న త‌ల్లికి తెలియ‌ద‌ని, ఆమె కంటే త‌న‌కు ఏదీ ముఖ్యం కాద‌ని చెప్పుకొచ్చాడు. త‌ను ఇంటిని అమ్మేస్తున్న విష‌యం అమ్మ‌కు తెలిస్తే అస్స‌లు ఒప్పుకోద‌ని చెబుతూ క‌న్నీరు పెట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటీజ‌న్లు అత‌డికి మ‌ద్దుతుగా కామెంట్లు చేస్తున్నారు. అధైర్యపడొద్దని, అమ్మగారు త్వ‌ర‌గానే కోలుకుంటారని ధైర్యం చెబుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం గొప్ప‌దంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్.. ‘గ‌ణేష్ అంథెమ్’కి టైం ఫిక్స్‌.. ఎప్పుడంటే..?