Ganesh Anthem lyrical Song released from Balakrishna Bhagavanth Kesari movie
Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా, శ్రీలీల (Sreeleela) బాలయ్య కూతురిగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) విలన్‌గా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈక్రమంలోనే సినిమాలోని మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు.
Baby Movie : 50 డేస్ పూర్తి చేసుకున్న బేబీ.. 100 మిల్లియన్ వ్యూస్.. 100 కోట్లకు..!
‘గణేష్ యాంతం’ అనే ఈ పాట ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాల్లో మారుమోగనుంది. కాసర్ల శ్యామ్ ఈ పాటకి లిరిక్స్ అందించగా కరీముల్లా, మనీష్ పండ్రంకి పాడారు. శేఖర్ మాస్టర్ గ్రాండ్ విజువల్స్ తో డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఇక ఈ పాటకు బాలయ్య, శ్రీలీల తమ ఎనర్జీని జతచేసి అభిమానులకు పూనకాలు వచ్చేలా చేస్తున్నారు. ఈ ఫుల్ వీడియో సాంగ్ కి థియేటర్స్ బాక్స్ లు బద్దలు అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు. మరి ఆ సాంగ్ వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
Vijay Devarakonda : ఒక్క హిట్టు కోసం ఐదేళ్లు.. కన్నీళ్లొస్తున్నాయి.. విజయ్‌దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలయ్య గత చిత్రాలు అఖండ, వీర సింహరెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ మూవీ పై కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి బాలయ్య హ్యాట్రిక్ హిట్టుని ఇస్తాడా..? లేదా..? చూడాలి.