Gangavva : సీఎం రేవంత్ రెడ్డి ఏ పదవి ఇచ్చినా చేస్తా.. ఆయనకు దండం పెట్టబోతే..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగవ్వ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Gangavva Interesting Comments on CM Revanth Reddy

Gangavva : యూట్యూబ్ వీడియోలతో ఫేమ్ తెచ్చుకొని బిగ్ బాస్, సినిమాలతో పాపులారిటీ తెచ్చుకుంది గంగవ్వ. ప్రస్తుతం టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగవ్వ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

గంగవ్వ మాట్లాడుతూ.. మా ఊరు దగ్గర పూడూరు అనే ఊళ్ళో రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ఉన్నాడు. నేను చూసి పోదామని వెళ్ళాను. రేవంత్ రెడ్డికి దండం పెట్టబోతే వద్దొద్దు అవ్వ అన్నాడు. మిరపయాక బజ్జిలు తీసుకెళ్లి పెడితే తిన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా పదవి ఇస్తే, ఏదైనా పని చెప్తే చేస్తా. నాకు కూడా ఆ ఆలోచన ఉంది. కేటీఆర్ కూడా ఏం చెప్పినా చేస్తా. నాకు అందరూ ఒకటే అని తెలిపింది. దీంతో గంగవ్వ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Akhanda 2 : బాలయ్య ‘అఖండ 2’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే.. తాండవం రాబోతుంది..

గంగవ్వ కూడా కోరుకుంటుంది కాబట్టి మరి నిజంగానే భవిష్యత్తులో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గంగవ్వకు ఉన్న ఫేమ్ చూసి ఏమైనా ఛాన్స్ ఇస్తాయేమో చూడాలి.