Gangubai Kathiawadi: గంగూబాయి వచ్చేది ఎప్పుడంటే..

అలియా భట్ ‘గంగూబాయి కథియావాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు..

Gangubai Kathiawadi: గంగూబాయి వచ్చేది ఎప్పుడంటే..

Gangubai Kathiawadi

Updated On : September 30, 2021 / 4:29 PM IST

Gangubai Kathiawadi : సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చెక్కి.. సినిమాను అద్భుతమైన శిల్పంగా మలుస్తుంటారు పాపులర్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. అలియా భట్ మెయిన్ లీడ్‌గా.. పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద జయంతి లాల్ గడా, సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న సినిమా ‘గంగూబాయి కథియావాడి’.. (మాఫియా క్వీన్)..

Gangubai Kathiawadi

ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ హుస్సైన్‌ జెదీ, గంగూబాయి జీవితం ఆధారంగా ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ అనే పుస్తకం రచించగా అత్యధిక కాపీలు అమ్ముడైన పుస్తకంగా రికార్డు క్రియేట్ చేసింది. ఆమె జీవిత కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడమే కాక సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనిపించింది.

Maidaan : రిలీజ్ డేట్ మళ్లీ మారింది..

పాండమిక్ వల్ల రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. రీసెంట్‌గా ‘గంగూబాయి కథియావాడి’ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. 2022 జనవరి 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.