Koffee with karan : షారుఖ్ భార్య గౌరీఖాన్ కూతురికి డేటింగ్ గురించి ఏం సలహా ఇస్తుందో తెలుసా??
ప్రోమోలో గౌరీఖాన్ ని కరణ్ అడిగిన ఓ ప్రశ్న, దానికి గౌరి ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. కరణ్ మీ కూతురికి డేటింగ్‌పై మీరిచ్చే సలహా ఏంటి అని గౌరీ ఖాన్‌ను అడగగా గౌరి............
- Saketh U
- Published On : September 20, 2022 / 08:33 AM IST
Gaurikhan advice to daughter suhana on Dating
Koffee with karan : బాలీవుడ్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే 11 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని పన్నెండో ఎపిసోడ్ రానుంది. తాజాగా 12వ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో షారుఖ్ భార్య గౌరీఖాన్, భావన పాండే, మహీప్ కపూర్ గెస్టులుగా వచ్చారు. ఇక ఎప్పటిలాగే కరణ్ తన పిచ్చి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది.
ఈ ప్రోమోలో గౌరీఖాన్ ని కరణ్ అడిగిన ఓ ప్రశ్న, దానికి గౌరి ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. కరణ్ మీ కూతురికి డేటింగ్‌పై మీరిచ్చే సలహా ఏంటి అని గౌరీ ఖాన్‌ను అడగగా గౌరి.. ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయొద్దని సలహా ఇస్తాను అని చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక గౌరి, షారుఖ్ లవ్ గురించి చెప్పాలంటే షారుఖ్ సినిమాల్లో ఏ టైటిల్ ని పెట్టుకుంటారు అని అడిగితే షారుఖ్ బిగ్గెస్ట్ హిట్ సినిమా దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే అని చెప్పింది.
Manirathnam : పొన్నియిన్ సెల్వన్‌లో ఐశ్వర్యకు బదులు ఆమెను తీసుకోవాలనుకున్నా.. ఐశ్వర్య డ్యూయల్ రోల్..
ఎపిసోడ్ లో షారుఖ్ కి కాల్ చేయించినట్లు తెలుస్తుంది. ఫుల్ ఎపిసోడ్ లో షారుఖ్ కి సంబంధించి మరిన్ని ప్రశ్నలు ఉండనున్నట్టు తెలుస్తుంది. ఫుల్ ఎపిసోడ్ గురువారం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో షారుఖ్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.
