Gautam Ghattamaneni : న్యూయార్క్ యూనివర్సిటీకి మహేష్ తనయుడు.. నమ్రత స్పెషల్ పోస్ట్..

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) తాజాగా గౌతమ్ గురించి మరో అప్డేట్ ఇచ్చింది.

Gautam Ghattamaneni went to New York University for higher studies

Gautam Ghattamaneni : మహేష్(Mahesh Babu) తనయుడు గౌతమ్ ఘట్టమనేని అందరికి పరిచయమే. వన్ నేనొక్కడ్నే సినిమాలో గౌతమ్ చిన్ననాటి మహేష్ క్యారెక్టర్ చేసి అభిమానులకు దగ్గరయ్యాడు. మహేష్ కూతురు సితార లాగా గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తూ ఉంటాడు. గౌతమ్ పై చదువులకు విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్ లో ప్లస్ 2 పూర్తి చేసినట్టు సమాచారం.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) తాజాగా గౌతమ్ గురించి మరో అప్డేట్ ఇచ్చింది. కార్ లో కొడుకుతో దిగిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి.. న్యూయార్క్ యూనివర్సిటీలో(NYU) కొత్త చాప్టర్ మొదలుపెడుతున్నాడు గౌతమ్. నీ హార్డ్ వర్క్, ప్యాషన్, సంకల్పం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. అవే నీకు ఇవాళ ఈ రోజుని తీసుకొచ్చాయి. నువ్ మరింత ఎదగాలి అంటూ తన కొడుకుకి ప్రేమతో లవ్ యు చెప్పింది నమ్రత.

Also Read : Thalaivar 171 : లోకేష్ కనగరాజ్ – రజినీకాంత్ సినిమాకి నో చెప్పిన షారుఖ్? ఇంకో బాలీవుడ్ స్టార్ దగ్గరకు లోకేష్..

దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో ఏం చదువుకోవడానికి వెళ్తున్నాడో అని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక పలువురు నెటిజన్లు, ప్రముఖులు గౌతమ్ కి అల్ ది బెస్ట్ చెప్తున్నారు.

 

Also Read : Bigg Boss 7 Final : బిగ్‌బాస్ ఫినాలే ప్రోమో చూశారా? రవితేజ గెస్ట్‌గా.. అమర్ దీప్‌కి నాగ్ బంపర్ ఆఫర్..