Krishna : చివరిసారిగా తాతయ్యకి నివాళ్లు అర్పించిన గౌతమ్ అండ్ సితార..
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఈ మంగళవారం ఉదయం తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అయన మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనయ్యింది. కృష్ణకు తుది నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు పద్మాలయ స్టూడియోస్ కి చేరుకుంటున్నారు. ఇక కృష్ణ మనవడు గౌతమ్, మనవరాలు సితార కూడా తాతయ్యకి కడసారి నివాళులు అర్పించారు.
- gum 95921
- Published On : November 16, 2022 / 01:38 PM IST
Gautham and Sitara pay their last recpects to krishna
Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఈ మంగళవారం ఉదయం తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అయన మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనయ్యింది. కృష్ణకు తుది నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు పద్మాలయ స్టూడియోస్ కి చేరుకుంటున్నారు. శోకసంద్రంలో ఉన్న మహేష్ బాబు కుటుంబానికి దైర్యం చెప్పి ఓదారుస్తున్నారు.
Super Star Krishna : పద్మాలయ స్టూడియోకి కృష్ణ భౌతికకాయం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు..
ఇక కృష్ణ మనవడు గౌతమ్, మనవరాలు సితార కూడా తాతయ్యకి కడసారి నివాళులు అర్పించారు. తల్లి నమ్రతతో కలిసి గౌతమ్, సితారలు తాతయ్య కృష్ణకి తుది వీడుకోలు పలికారు. ఇక అభిమానుల సందర్శనార్ధం కోసం పద్మాలయ స్టూడియోస్ లో కృష్ణ భౌతికకాయాన్ని ఉంచగా, మరికాసేపటిలో అంతిమయాత్రగా జూబిలీహిల్స్ మహాప్రస్థానానికి బయలుదేరనుంది.
సూపర్ స్టార్ కృష్ణకు ప్రభుత్వ లాంఛనాలు మధ్య అంత్యక్రియలు నిర్వహించామని తెలంగాణా ప్రభుత్వం అధికారులను ఆదేసింది. సుమారు 3 గంటల సమయంలో మహాప్రస్థానంలో కృష్ణ గారికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణ మరణంతో తెలుగుతెరపై ఒక శకం ముగిసిపోయింది. తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది.
