Gautham Menon: ‘సమంత-చైతన్య’ల విడాకులపై.. “ఏ మాయ చేసావే” డైరెక్టర్ గౌతమ్ మీనన్ స్పందన
ఏ మాయ చేసావే సినిమాతో సమంతను వెండితెరకు పరిచయం చేసిన గౌతమ్ మీనన్. చైతు, సమంత ల విడాకుల పై అయన అభిప్రాయం తెలిపాడు. ప్రస్తుతం అయన తమిళ్ హీరో శింబుతో గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కిన "లైఫ్ అఫ్ ముత్తు" శనివారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
- gum 95921
- Updated on- September 18, 2022 / 08:19 PM IST
Gautham Menon Comments on Naga Chaitanya Samantha Divorce
Gautham Menon: ఏ మాయ చేసావే సినిమాతో సమంతను వెండితెరకు పరిచయం చేసిన గౌతమ్ మీనన్. చైతు, సమంత ల విడాకుల పై అయన అభిప్రాయం తెలిపాడు. ప్రస్తుతం అయన తమిళ్ హీరో శింబుతో గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కిన “లైఫ్ అఫ్ ముత్తు” శనివారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
Nagarjuna: సమంత నాగచైతన్యకి ఒక చేదు అనుభవం అంటున్న నాగార్జున..
ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య సమంతలు మీ సినిమా ద్వారా కలిశారు, పెళ్లి చేసుకున్నారు, తరువాత విడిపోయారు. అయితే ఒకే ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా, చేసుకుంటుంటే ఇలాంటి షార్ట్ టర్మ్ రిలేషన్ షిప్స్ ఎందుకు ఉంటున్నాయి అని అడగా, గౌతమ్ మీనన్ బదులు ఇస్తూ.. “కొన్ని బంధాలు చివరి వరకు ఉండవచ్చు, కొన్ని బంధాలు మధ్యలోనే తెగిపోవచ్చు వాటి గురించి మనం మాట్లాడకూడదు.
రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరి మధ్య విబేధాలు రావచ్చు, తప్పులు ఉండొచ్చు. వాటిని యాక్సప్ట్ చేసి ముందుకు వెళితే.. ఒకే ప్రొఫెషన్ లో ఉన్నామా, లేదా అనేది అనవసరం. అయినా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి రెండు మనసులు కలిస్తే చాలు” అంటూ బదులిచ్చాడు. ఇక గౌతమ్ మీనన్ తదుపరి చిత్రం టాలీవుడ్ హీరో “రామ్ పోతినేని”తో ఉండబోతున్నట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
