Nagarjuna: సమంత నాగచైతన్యకి ఒక చేదు అనుభవం అంటున్న నాగార్జున..

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. సినిమా విడుదల దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా విలేకర్ల సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒక విలేకరు నాగార్జునను ఇలా ప్రశ్నించాడు.. "నాగచైతన్య ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించే చాలా మంది ఎక్కువగా రాస్తున్నారు, అవి మిమ్మల్ని బాధించడం లేదా" అన్న ప్రశ్నకు నాగార్జున కూల్ గా బదులిస్తూ...

Nagarjuna: సమంత నాగచైతన్యకి ఒక చేదు అనుభవం అంటున్న నాగార్జున..

Nagarjuna Comments on Naga Chaitanya and Samantha Divorce

Updated On : September 15, 2022 / 9:35 PM IST

Nagarjuna: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది. కింగ్ నాగ్ ఈ సినిమాలో ‘రా ఏజెంట్’గా కనిపించబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అండ్ టీజర్స్ లో తెలుస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Samantha Father : చైసామ్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఇది ఒక కథ.. కొత్త అధ్యాయం మొదలు.. సమంత తండ్రి ఎమోషనల్ పోస్ట్..

సినిమా విడుదల దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా విలేకర్ల సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒక విలేకరు నాగార్జునను ఇలా ప్రశ్నించాడు.. “నాగచైతన్య ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించే చాలా మంది ఎక్కువగా రాస్తున్నారు, అవి మిమ్మల్ని బాధించడం లేదా” అన్న ప్రశ్నకు నాగార్జున కూల్ గా బదులిచ్చాడు.

“చైతన్య ప్రస్తుతం సంతోషంగా ఉంటున్నాడు, నేను చూస్తున్నది అంతే. అది నాకు సరిపోతుంది. కాకపోతే అది అతనికి జరిగిన ఒక చేదు అనుభవం. మనం దాని మార్చను లేము, అలాని అక్కడే ఆగిపోను లేము. ఆ అనుభవం నుంచి బయటపడడమే జీవితం” అంటూ నవ్వుతూ బదులిచ్చాడు నాగార్జున. కాగా నాగచైతన్య, సమంత లు ఇటీవల ఎక్కడకు వెళ్లిన ఈ ప్రశ్నలు ఎదురవ్వడం మనకి తెలిసిందే.