Gautham Vasudev Menon : ‘డియర్ ఆస్ట్రోనాట్’ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్..

అక్టోబర్‌లో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. (Gautham Vasudev Menon)

  • Published on- September 22, 2026 / 07:22 PM IST

Gautham Vasudev Menon

Gautham Vasudev Menon : యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’. వరుణ్ సందేశ్, వితిక షేరు జంటగా నటిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా గౌతమ్ వాసుదేవ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమాలో డేవిడ్ థామస్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ కనిపించబోతోన్నారు. ఆయన క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్‌కు ఆసక్తికరంగా, హైలైట్ గా నిలవనుంది మూవీ టీమ్ తెలిపారు. అంతరిక్షంలోకి ప్రయాణించాలనే ఓ యువతి కథ ఈ సినిమా. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ కథే డియర్ ఆస్ట్రోనాట్. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఆమె సాగించే ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతోన్నారు.

Also Read : Kayadu Lohar : ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కర్లీ హెయిర్‌తో చీరకట్టులో ‘కయదు లోహర్’.. ఫొటోలు..

సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.