Geetha Madhuri – Nandu : గీతామాధురి – నందు.. కొడుకు పేరు ఏం పెట్టారో తెలుసా? చివర్లో ఎన్టీఆర్ పేరులోని ఓ పదంతో..

ఫిబ్రవరి 10న తమకు బాబు పుట్టాడని నందు-గీతామాధురి తెలిపారు. తాజాగా ఆ బాబుకి పెట్టిన పేరుని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది గీతా.

Geetha Madhuri Nandu Son Name shares in Social Media Goes Viral

Geetha Madhuri – Nandu : టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో సింగర్ గీతామాధురి – నటుడు నందు జంట కూడా ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కపుల్ గోల్స్ అని హ్యాపీగా ఉన్న వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. నందు – గీతామాధురిలు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి ఒక పాప పుట్టింది. ఆ పాపకు దాక్షాయణి ప్రకృతి అనే పేరుని పెట్టారు.

Also Read : Samantha : బాత్రూంలో స్టైలిష్ ఫొటోలతో.. వైరల్ అవుతున్న సమంత..

ఇటీవలే గీతామాధురి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 10న తమకు బాబు పుట్టాడని నందు-గీతామాధురి తెలిపారు. తాజాగా ఆ బాబుకి పెట్టిన పేరుని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది గీతా. నందు – గీతామాధురి తమ బాబుకు ‘ధృవధీర్ తారక్’ అని పేరు పెట్టారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గీతా – నందుకి మరోసారి అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పేరులో తారక్ అని అని ఉండటంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ పేరుని తెగ వైరల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు