Geetha Singh : ఇండస్ట్రీలో ఫీమేల్ ఆర్టిస్టులకి తొందరగా ఛాన్సులు రావు.. ఇండస్ట్రీ వాళ్ళే నన్ను మోసం చేశారు..
గీతా సింగ్ మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో ఫీమేల్ ఆర్టిస్టులకి ఛాన్సులు రావడం చాలా కష్టం. ఇండస్ట్రీలో పురుషాధిక్యం బాగా పెరిగింది. నా లాంటి వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు.........
- Saketh U
- Published On : October 16, 2022 / 07:15 AM IST
Geetha Singh Sensational Comments on Industry
Geetha Singh : కితకితలు సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన గీతా సింగ్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించి కనుమరుగైంది. ఎప్పుడో ఒకటి అరా సినిమాలతో, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉంది గీతా సింగ్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ గురించి గీతా సంచలన విషయాలు చెప్పింది. అలాగే తను పడుతున్న కష్టాల గురించి కూడా చెప్పి ఎమోషనల్ అయింది.
గీతా సింగ్ మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో ఫీమేల్ ఆర్టిస్టులకి ఛాన్సులు రావడం చాలా కష్టం. ఇండస్ట్రీలో పురుషాధిక్యం బాగా పెరిగింది. నా లాంటి వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు ఛాన్సులు పిలిచి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఛాన్సులు అడిగినా ఇవ్వట్లేదు” అని తెలిపింది.
ఇక తన కష్టాల గురించి చెప్తూ.. ”ప్రస్తుతం నాకు ఎవ్వరూ సపోర్ట్ చెయ్యట్లేదు. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఒకరు నన్ను చిట్టీల పేరుతో మోసం చేశారు. ఎవరి సపోర్ట్, సినిమా ఛాన్సులు లేక ఒక్కదాన్నే కష్టపడుతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ మా అన్నయ్య చనిపోవడంతో వాళ్ళ పిల్లలని నేను దత్తత తీసుకున్నాను. వాళ్ళ కోసమైనా కష్టపడాలి. ప్రస్తుతం వాళ్ళ కోసమే బతుకుతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు” అని చెప్తూ ఎమోషనల్ అయింది గీతా సింగ్.
