×
Ad

Geetu Mohandas : లేడీ డైరెక్టర్ మీద నమ్మకం లేదా? మళ్ళీ రీ షూట్స్ చేయమన్న హీరో..?

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం వల్లే ఈ సినిమాని వాయిదా వేసినట్టు చెప్పారు. (Geetu Mohandas)

  • Published On : March 11, 2026 / 08:24 AM IST

Geetu Mohandas

Geetu Mohandas : నటిగా మలయాళంలో ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన గీతూ మోహన్ దాస్ ఆ తర్వాత దర్శకురాలిగా మారింది. మలయాళంలో పలు సినిమాలు తెరకెక్కించిన గీతూ ఇప్పుడు యశ్ హీరోగా టాక్సిక్ సినిమా తెరకెక్కిస్తోంది. టాక్సిక్ గ్లింప్స్ తోనే వార్తల్లో నిలిచింది గీతూ. కెజిఎఫ్ తర్వాత వస్తుండటంతో యశ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు కానీ ఇప్పటివరకు ఈ సినిమాపై హైప్ ఇచ్చే కంటెంట్ ఏది రిలీజ్ కాలేదు.

వచ్చిన రెండు గ్లింప్స్, టీజర్ లో అడల్ట్ కంటెంట్, మొత్తం వైలెన్స్, యాక్షన్ సీన్స్ తప్ప ఏమి లేవు. ఈ సినిమా మార్చ్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా జూన్ కి వాయిదా వేశారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం వల్లే ఈ సినిమాని వాయిదా వేసినట్టు చెప్పారు. అయితే కన్నడ మీడియా సమాచారం ప్రకారం వాయిదా పడటానికి వేరే కారణాలు ఉన్నాయట.

Also Read : NTR : వామ్మో ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? అందుకేనా ఇంత సన్నబడ్డాడు..

టాక్సిక్ అవుట్ ఫుట్ చూసాక యశ్ కి నచ్చలేదని సమాచారం. సినిమా ఫైనల్ కట్ చూసాక గీతూని కొన్ని సీన్స్ ని మళ్ళీ రీషూట్ చేయమన్నాడట యశ్. అలాగే వీఎఫ్ఎక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా మార్పులు చెప్పాడట. తొందరపడి రిలీజ్ చేయొద్దని ఈ మార్పులు అన్ని చేసిన తర్వాత ఫైనల్ అవుట్ ఫుట్ చూసి సంతృప్తి చెందిన తర్వాతే ఈ సినిమాని రిలీజ్ చేద్దామని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి యశ్ చెప్పినట్టు తెలుస్తుంది.

దీంతో గీతూ ఆ పనిలో పడింది. మరి జూన్ లో అయినా రిలీజ్ చేస్తారా లేక మళ్ళీ వాయిదా వేస్తారా చూడాలి. ఇక ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి, ఓ బ్రెజిలియన్ నటి నటిస్తున్నారు. ఇంతమంది హీరోయిన్స్ ని పెట్టి పాన్ ఇండియా సినిమాగా టాక్సిక్ ని రెడీ చేస్తున్నారు. మరి ఈ సినిమా కెజిఎఫ్ ని మించి మెప్పిస్తుందా లేదా చూడాలి.

Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఎప్పుడు? ఎక్కడ?