GHMC issues notices to Ramanaidu and Annapurna Studios
GHMC: హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలకు, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు షాకిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ తాలూకు ఫీజులను పూర్తిగా చెల్లించాలి అంటూ నోటీసులు జారీ చేశారు. కొన్నేళ్లుగా అన్నపూర్ణ స్టూడియోలకు, రామానాయుడు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్కువ చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తమ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేసినట్లు తెల్సుకున్నారు అధికారులు. అధికారుల లెక్కల ప్రకారం రామానాయుడు స్టూడియోస్ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ రూ.1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.1900 మాత్రమే చెల్లిస్తున్నారట. ఆలాగే, అన్నపూర్ణ స్టూడియోస్ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ రూ.11.52 లక్షలు కాగా రూ.49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు.
Priyadarshi: గడ్డి పీకమంటావా.. నెటిజన్ తింగరి ప్రశ్నకి ప్రియదర్శి సాలిడ్ కౌంటర్..