Gnanavel Raja : సూర్య 42 సినిమాతో బాహుబలికి సమాధానం ఇస్తాం.. తమిళ నిర్మాత వ్యాఖ్యలు..

సూర్య 42వ సినిమాని కమర్షియల్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా, తెలుగు నిర్మాతలు యువీ క్రియేషన్స్ వంశీ ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా తమిళ్ లో ఓ ఇంటర్వ్యూ..................

Gnanavel Raja :  తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సూర్య. సూర్య(Suriya) సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజవుతాయి. ఇక్కడ కూడా సూర్యకి మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం సూర్య రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సూర్య 42వ సినిమాని కమర్షియల్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా, తెలుగు నిర్మాతలు యువీ క్రియేషన్స్(UV Creations) వంశీ ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు.

రాజుల కాలం, బందిపోటు లాంటి కథాంశంతో ఈ సినిమాని భారీగా 200 కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ పెట్టలేదు. ఈ సినిమాపై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Nivetha Pethuraj : విశ్వక్ డైరెక్టర్ గా లోకేశ్ కనగరాజ్ లా సక్సెస్ అవుతాడు.. అతని దగ్గర చాలా కథలు ఉన్నాయి..

తాజాగా ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా తమిళ్ లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. సూర్య 42 సినిమాని ఆయన గత సినిమా కంటే మూడు రేట్లు ఎక్కువ ఖర్చుతో భారీగా నిర్మిస్తున్నాం. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ఏప్రిల్ లో రిలీజ్ చేస్తాం. మేలో ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేస్తాం. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తయింది. సినిమాపై మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ సినిమాతో బాహుబలి, KGF లాంటి సినిమాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి సమాధానం ఇస్తాం అని అన్నారు. దీంతో జ్ఞానవేల్ రాజా చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా తమిళ్ వాళ్ళు వీటిని మరింత వైరల్ చేస్తుంటే తెలుగు ఆడియన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు. మరి సూర్య 42 ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు