God Movies : దేవుడే దిక్కు.. సినిమాల్లో దేవుడి లీలలు.. స్టార్లు సైతం దేవుడి క్యారెక్టర్లలో..
రొటీన్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమైపోతోంది మేకర్స్ కి. స్టార్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకూ మైథాలజీ మీద ఇంట్రస్ట్ చూపిస్తూ వరసగా దేవుడ్నే హిట్ ఫార్ములాగా తెరమీదకి తీసుకొస్తున్నారు. దేవుడంటే.............

god movies trending in movies stars also doing god characters
God Movies : లవ్ స్టోరీల్లో అవే పాటలు, అదే రొమాన్స్, అదే డ్రామా. యాక్షన్ సినిమాల్లో అదే ఫైట్లు, అదే మాస్ డ్రామా, ఎలివేషన్స్. ఎన్నాళ్లని ఈ రొటీన్ సినిమాలు చూస్తారు ఆడియన్స్ ..? అందుకే ఈ సారి మైథాలజీ మీద పడ్డారు మేకర్స్. భక్తితో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు హీరోలు. టాలీవుడ్ టూ బాలీవుడ్ దేవుడ్నే నమ్ముకుంటున్నారు.
రొటీన్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమైపోతోంది మేకర్స్ కి. స్టార్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకూ మైథాలజీ మీద ఇంట్రస్ట్ చూపిస్తూ వరసగా దేవుడ్నే హిట్ ఫార్ములాగా తెరమీదకి తీసుకొస్తున్నారు. దేవుడంటే రామాయణం, మహాభారతం కాదు ఏకంగా దేవుడే దిగి వస్తే ఏం చేస్తాడు? భక్తుడికి కష్టం వస్తే దేవుడు ఎలా వస్తాడు అనే కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తున్నారు. దేవుడిగా కనపడటానికి స్టార్ హీరోలు సైతం సై అంటున్నారు.
లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ లీడ్ రోల్స్ లో సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న చేస్తున్న సినిమా వినోదయ సీతమ్ రీమేక్ దేవుడి బ్యాక్ డ్రాప్ మూవీయే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నారు. ఆల్రెడీ గతంలో గోపాల గోపాల మూవీలో దేవుడిగా కనిపించారు పవర్ స్టార్. ఇటీవల విష్వక్సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో వెంకటేష్ కాసేపు దేవుడిగా కనిపించాడు. ఈ సినిమా తమిళ్ ఓ మై కడువలె నుంచి రీమేక్ అయింది. తమిళ్ లో ఈ సినిమాలో విజయ్ సేతుపతి దేవుడిగా కనిపించాడు.
ఇప్పటి వరకూ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లు, సోషియో ఫాంటసీ సినిమాలు, బ్యూటిఫుల్ లవ్ స్టోరీలతో అన్ని జానర్లు టచ్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సారి మైథాలజీతో ఒకటి కాదు రెండు సినిమాలతో మెస్మరైజ్ చెయ్యబోతున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కి మైథాలజీ టచ్ కూడా ఉంటుందని ఇటీవలే హింట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ అశ్వనీ దత్. ఆల్రెడీ ప్రభాస్ ఆదిపురుష్ లో రాముడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఓమ్ రౌత్ డైరెక్షన్లో 500కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.
తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా దేవుడి మీద ఇంట్రస్టింగ్ సినిమాలొస్తున్నాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రణబీర్, ఆలియా జంటగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర మంచి సక్సెస్ అందుకుంది. విశ్వమంతా నిండి ఉన్న శివుడి గురించి, ఆయన శక్తి, అస్త్రాలపై తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్, నాగార్జున లాంటి భారీ స్టార్ కాస్ట్ తో 3 పార్టులుగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర.. సెకండ్ పార్ట్ షూటింగ్ కి రెడీ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన మూవీ ఓ మైగాడ్ కి సీక్వెల్ చేస్తున్నారు. మరోసారి కృష్ణుడికి, సామాన్యుడికి మధ్యలో జరిగిన డ్రామాగా తెరకెక్కుతున్న ఓ మై గాడ్ 2 మీదే ఇప్పుడు అందరి దృష్టి . మోస్ట్ కాంట్రవర్షియల్ అయినా కూడా ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న ఓ మై గాడ్ 2తో అక్షయ్ కుమార్ హిట్ అందుకుంటారని ఆశపడుతున్నారు ఫాన్స్ . ఒకప్పుడు అమ్మోరు లాంటి దేవుడి సినిమాలతో హిట్ కొట్టారు. ఇప్పుడు ఇలా ఆదేవుడ్ని కొత్త కొత్త రూపాల్లో కొత్త కొత్త కథలలో చూపించి హిట్స్ కొడదామని ట్రై చేస్తున్నారు.