ఆర్.కె.స్టూడియోస్ అమ్మేసారు..

స్టూడియో మీద సరైన ఆదాయం రాకపోవడం, దాని నిర్వహణ ఖర్చు పెరిగి పోవడంతో చివరకు స్టూడియోను అమ్మెయ్యాలని డిసైడ్ అయిన రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు, ఆ స్థలాన్ని గోద్రేజ్ ప్రాపర్టీస్ సంస్థకు అమ్మేసారు..

  • Publish Date - May 4, 2019 / 06:16 AM IST

స్టూడియో మీద సరైన ఆదాయం రాకపోవడం, దాని నిర్వహణ ఖర్చు పెరిగి పోవడంతో చివరకు స్టూడియోను అమ్మెయ్యాలని డిసైడ్ అయిన రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు, ఆ స్థలాన్ని గోద్రేజ్ ప్రాపర్టీస్ సంస్థకు అమ్మేసారు..

బాలీవుడ్ దిగ్గజ నటుడు, దర్శక, నిర్మాత రాజ్ కపూ‌ర్‌కి చెందిన ఆర్.కె.స్టూడియోస్‌ని ఆయన కుటుంబ సభ్యులు అమ్మేసారు. అందుకు ఆర్థిక ఇబ్బందులు వంటివి కారణం కాదు కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో స్టూడియో‌‌స్‌ని అమ్మడం జరిగిందని ఆయన కుమారుడు రణధీర్ కపూర్ చెప్తున్నారు. 1948 సంవత్సరంలో ముంబై శివార్లలోని చెంబూరులో ఒక రెండెకరాల స్థలంలో, తన అభిరుచికి తగ్గట్టు రాజ్ కపూర్ ఆర్.కె.స్టూడియో‌స్‌ని కట్టించారు. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల నిర్మాణానికి ఈ స్టూడియో వేదికగా నిలిచింది.

రాజ్ కపూర్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు స్టూడియో నిర్వహణ చూసుకునేవారు. పలు షూటింగ్‌లకు స్టూడియోను అద్దెకిచ్చేవారు. సిటీకి దూరంగా ఉండడం, పైగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో, బాలీవుడ్ వాళ్ళు ఆర్.కె.స్టూడియోస్‌కి రావడం తగ్గించేసారు. పైగా గతేడాది అగ్నిప్రమాదం జరిగి రాజ్ కపూర్‌కి సంబంధించిన కాస్ట్యూమ్స్, మిగతా విలువైన వస్తువులు కాలిపోయాయి.

స్టూడియో మీద సరైన ఆదాయం రాకపోవడం, దాని నిర్వహణ ఖర్చు పెరిగి పోవడంతో చివరకు స్టూడియోను అమ్మెయ్యాలని డిసైడ్ అయిన రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు, ఆ స్థలాన్ని గోద్రేజ్ ప్రాపర్టీస్ సంస్థకు అమ్మేసారు. ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారని తెలుస్తంది. స్టూడియోని ఎంతకు అమ్మారు అనేది ఖచ్చితంగా తెలీదు కానీ, రూ.200 కోట్లకు డీల్ కుదిరినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.