ప్రతిభకు పట్టం : గొల్లపూడిని వరించిన పురస్కారాలు

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 10:08 AM IST
ప్రతిభకు పట్టం : గొల్లపూడిని వరించిన పురస్కారాలు

Updated On : December 12, 2019 / 10:08 AM IST

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు గురువారం (డిసెంబర్ 12) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని లైఫ్‌లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.బహు ప్రజ్ఞాశాలిగా పేరొందిన గొల్లపూడి మారుతీరావును ఎన్నో పురస్కారాలు వరించాయి. ఆయన ప్రతిభాపాటవాలకు నిదర్శనంగా నిలిచాయి. పలు రంగాల్లో రాణించిన గొల్లపూడి మారుతీరావుకు ఐదు సార్లు నంది అవార్డులు వరించాయి.

1963లో డాక్టర్‌ చక్రవర్తి సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిగా, 1965లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా, 1989లో కళ్ళు అనే రచన సినిమాగా వచ్చింది. దీనికి ఉత్తమ రచయితగా, 1991లో మాస్టారి కాపురం సినిమాకు గానూ ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డులు అందుకున్నారు గొల్లపూడి.అప్పాజోశ్యుల విష్ణుభట్ల ఫౌండేషన్‌ జీవన సాఫల్య అవార్డు, గురజాడ అప్పారావు, పురస్కారం, పులికంటి కృష్ణా రెడ్డి పురస్కారం, ఆత్రేయ స్మారక పురస్కారం, రాజ్యలక్ష్మి అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, వంశీ బర్కిలీ అవార్డు, శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి అవార్డు, కొండముది శ్రీరామ చంద్రమూర్తి అవార్డు, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డు ఇలా ఎన్నో అవార్డులు పొందారు గొల్లపూడి.