Gopichand : మ్యాచో స్టార్ గోపీచంద్ గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత సంవత్సరం భీమా సినిమాతో వచ్చినా అది యావరేజ్ గా నిలిచింది.
తాజాగా గోపీచంద్ తన నెక్స్ట్ సినిమా ప్రకటించారు. ఇది గోపీచంద్ కి 33వ సినిమా.
ఘాజీ, అంతరిక్షం, IB71 లాంటి ఆసక్తికర సినిమాలు తీసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ తన నెక్స్ట్ సినిమా ప్రకటించాడు.
ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది అని తెలుస్తుంది.
నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఈసారి మాత్రం గోపీచంద్ హిట్ కొట్టేస్తాడు అని భావిస్తున్నారు.