Gopichand : కొత్తగా సరికొత్తగా గోపీచంద్.. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో..
కెరీర్‌ని మునుపటలా పరుగులు పెట్టించేందుకు సరికొత్త కథలతో సిద్ధమవుతున్నారు. (Gopichand)
- Saketh U
- Published on- October 25, 2026 / 05:38 PM IST
Gopichand
Gopichand : వరుస ఫెయిల్యూర్స్ నుంచి సాలిడ్ కంబ్యాక్‌కి రెడీ అవుతున్నారు గోపీచంద్. సక్సెస్ అందించిన మూస కథలకి గుడ్‌బై చెప్పేసి ఫైనల్లీ నెవర్‌బిఫోర్ ప్రాజెక్స్ట్‌తో ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. ప్రస్తుతం మ్యాచోస్టారో గోపీచంద్ వరుస ప్రస్టేజియస్ సినిమాలతో ఫుల్‌బిజీగా ఉన్నారు. కెరీర్‌ని మునుపటలా పరుగులు పెట్టించేందుకు సరికొత్త కథలతో సిద్ధమవుతున్నారు.
సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న భరతవర్ష షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టిన మేకర్స్.. రీసెంట్‌గా అమ్మ కదిలి వచ్చే లిరికల్ సాంగ్ తో భరతవర్ష మ్యూజికల్ ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు. భరతవర్ష సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేస్తోన్న స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. సింగా అనే మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు గోపీచంద్.
Also See : Sri devi : హైకూ మూవీ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన శ్రీదేవి..
70MM ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్.. 50 శాతం పూర్తయ్యింది. సింగా లేటెస్ట్ పోస్టర్‌తో సినిమాలో గోపిచంద్ క్యారెక్టరైజేషన్‌పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. భారీ బడ్జట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ CS సంగీతం అందిస్తున్నారు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ 2 పాన్ ఇండియా సినిమాలతో కంబ్యాక్ రెడీ అవుతోన్న గోపీచంద్.. ఓ విషయంలో మాత్రం సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన భరతవర్ష, సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయిన సింగా సినిమాలకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి రిలీజ్ డేట్ ప్రకటించలేదు. తొందరపడి విడుదల తేదీ అనౌన్స్ చేసి.. చివరి నిమిషంలో వాయిదా పడి ట్రోల్ అవ్వడం కంటే.. అంతా పర్ఫెఫెక్ట్‌గా సిద్ధం చేసుకుని బాక్సాఫీస్ బరిలో దిగాలని చూస్తున్నారు గోపీచంద్. మరి సరికొత్త కథలతో సరికొత్తగా వస్తోన్న గోపీచంద్.. భరతవర్ష, సింగా సినిమాలతో ఎలాంటి సక్సెస్ చూస్తారో చూడాలి.
