Gopichand : గోపీచంద్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ‘భీమా’.. పోలీస్ కమర్షియల్ కథతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా..

'భీమా' ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ మీడియాతో ముచ్చటించి సినిమా గురించి అనేక విషయాలు తెలిపారు.

Gopichand Exclusive Interview about Bhimaa Movie

Gopichand : మాచో స్టార్ గోపీచంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు భీమా(Bhimaa) సినిమాతో రాబోతున్నారు. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై KK రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా భీమా. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు నెలకొనగా భీమా మార్చి 8న మహా శివరాత్రి నాడు విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ మీడియాతో ముచ్చటించి సినిమా గురించి అనేక విషయాలు తెలిపారు.

 

‘భీమా’ జర్నీఎలా మొదలైయింది?

భీమా సినిమా సహా నిర్మాత శ్రీధర్ గారు కోవిడ్ సమయంలో హర్షని పరిచయం చేస్తే ఒక కథ చెప్పారు. కానీ ఆ కథ బానే ఉన్నా ఈ టైంలో వర్కౌట్ అవ్వదు అనిపించి ఏదైనా కొత్తగా ఉండే పోలీసు కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా కథ చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్, అందులోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ నచ్చి ఓకే చేశాము.

ఇప్పటికే మీరు చాలా పోలీసు పాత్రలు చేశారు.. వాటికి, భీమాకి తేడా ఏంటి?

గోలీమార్ లో డిఫరెంట్ కాప్. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ పోలీసు కథే. శౌర్యం కూడా కొంచెం డిఫరెంట్. ఈ సినిమాలకు పూర్తిగా డిఫరెంట్ పాత్ర భీమా. పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంది. అదే నాకు ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది.

చాలా మంది ఈ సినిమాని ‘అఖండ’తో పోలుస్తున్నారు.. కథ విన్నప్పుడు మీకు అలా అనిపించలేదా?

నాకు అలా అనిపించలేదు. ట్రైలర్ లో అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వలన కొంతమందికి అలా అనిపించవచ్చు. కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. కానీ నిజంగా ‘అఖండ’తో పోలిస్తే మంచిదే.

Also Read : Nivetha Pethuraj : నేను, నా కుటుంబం ఒత్తిడిలో ఉన్నాం.. తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి.. హీరోయిన్ సంచలన పోస్ట్..

భీమా కథ విన్నపుడు, దర్శకుడికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు?

కథ విన్న తర్వాత నాకు అనిపించింది చెప్పాను. అయితే హర్ష అనుభవం ఉన్న డైరెక్టర్. చాలా అద్భుతంగా తీశాడు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు వేరే టైటిల్స్ అనుకున్నా చివరికి ఇదే బాగుంది అని ఇదే పెట్టమని చెప్పను.

రవిబస్రూర్ మ్యూజిక్ గురించి ?

ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. నేను ఇంకా ఫైనల్ అవుట్ ఫుట్ చూడలేదు. రవి మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు.

సినిమాలో శివుని నేపధ్యం ఉంది.. సినిమా కూడా మహా శివరాత్రికి వస్తుంది.. ఇలా ప్లాన్ చేశారా?

లేదండీ. ముందు డిసెంబర్ లో అనుకున్నాము. వేరే సినిమాలు ఉండటంతో వాయిదా పడి ఇప్పుడు ఇలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను.

నిర్మాత రాధమోహన్ గారి గురించి ?

రాధమోహన్ గారు నాకు చాలా క్లోజ్. ఆయనతో గతంలో పంతం సినిమా చేశాను. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. సినిమాని చాలా గ్రాండ్ గా, ఆయన కెరీర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు.

నాన్నగారిలా దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?

దర్శకత్వం చాలా కష్టమైన పని. అది నేను చేయలేను.

మీరు ప్రభాస్ గారు కలసి సినిమా చేసే ప్లానింగ్ ఉందా ?

మేము కలసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. దానికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు. కానీ అన్ని కుదిరితే కచ్చితంగా చేస్తాం.

తర్వాత రాబోయే సినిమాల గురించి?

శ్రీను వైట్ల గారితో చేస్తున్న సినిమా ముఫ్ఫై శాతం అయ్యింది. తర్వాత నిర్మాత ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంది. డైరెక్టర్ రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో ఉంటుంది అని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు