Nivetha Pethuraj : నేను, నా కుటుంబం ఒత్తిడిలో ఉన్నాం.. తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి.. హీరోయిన్ సంచలన పోస్ట్..
ఇటీవల తమిళ మీడియాలో కొంతమంది నివేదా పేతురాజ్ పై నెగిటివ్ గా వార్తలు రాశారు. దీంతో నివేదా పేతురాజ్ అలాంటి వార్తలపై తన సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందిస్తూ ఫైర్ అయింది.
Nivetha Pethuraj : నివేదా పేతురాజ్.. తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో పరిచయమై బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, పాగల్, రెడ్, దాస్ కా ధమ్కీ.. లాంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులని మేపించింది. నివేదా పేతురాజ్ నటి మాత్రమే కాదు, రేసర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా.
అయితే ఇటీవల తమిళ మీడియాలో కొంతమంది నివేదా పేతురాజ్ పై నెగిటివ్ గా వార్తలు రాశారు. నివేదా పేతురాజ్ పై కొంతమంది డబ్బులు ఖర్చుపెడుతున్నారని అభ్యంతకర వార్తలు రాశారు. దీంతో నివేదా పేతురాజ్ అలాంటి వార్తలపై తన సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందిస్తూ ఫైర్ అయింది.
నివేదా పేతురాజ్ తన ట్వీట్ లో.. ఇటీవల నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు రాసారు. మొదట నేను మౌనంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవాళ్ళు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేముందు వాళ్ళు విన్న సమాచారం నిజమా కాదా అని ధృవీకరించడానికి మానవత్వం ఉంటుందని అనుకున్నాను. ఈ వార్తలతో కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు రాసే ముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల నుండే సంపాదించడం మొదలుపెట్టాను. నా ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంటుంది. 20 ఏళ్లకు పైగా మేము దుబాయ్‌లోనే ఉన్నాము.
సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు ఛాన్స్ ఇవ్వమని ఏ రోజు ఏ నిర్మాతను, డైరెక్టర్ ని, హీరోని అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను, అవన్నీ నా దగ్గరికి వచ్చిన అవకాశాలే. నేను డబ్బు కోసం అత్యాశ పడను. నా గురించి వచ్చిన వార్తలు అన్ని అబద్దాలే. మేము 2002 నుండి దుబాయ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాము. నేను చాలా సాధారణ లైఫ్ గడుపుతాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే నేను ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరుకున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను.
Also Read : Game Changer : రామ్ చరణ్ బర్త్ డేకి గిఫ్ట్ ఫిక్స్.. ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ అదే.. అయినా నిరాశలోనే అభిమానులు..
ఆ వార్తలు రాసేవాళ్ళల్లో కొంత మానవత్వం ఉందని, వాళ్ళు నన్ను ఇలా పరువు తీయడం మళ్ళీ చేయరని భావిస్తూ దీనిపై లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కుటుంబాల ప్రతిష్టని నాశనం చేసేముందు ఆ వార్తలు నిజమో కాదో తెలుసుకొని రాయండి. ఇకపై నన్ను బాధలకు గురిచేయకండి. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ అంటూ పోస్ట్ చేసింది. దీంతో నివేదా పేతురాజ్ ట్వీట్ వైరల్ గా మారింది.
Lately there has been false news circulating about money being lavishly spent on me. I kept quiet because I thought people who are speaking about this will have some humanity to verify the information they receive before mindlessly spoiling a girl’s life.
My family and I have…
— Nivetha Pethuraj (@Nivetha_Tweets) March 5, 2024