×
Ad

Gopichand Malineni : రవితేజ సినిమా పక్కన పెట్టి.. అదే కథతో బాలీవుడ్ కి వెళ్లిన గోపీచంద్ మలినేని?

మైత్రి మేకర్స్ నిర్మాణంలో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో థమన్ సంగీత దర్శకుడిగా సినిమా ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.

  • Published On : December 11, 2023 / 01:43 PM IST

Gopichand Malineni hold Raviteja Movie and went to Bollywood for Sunny Deol Rumors goes Viral

Gopichand Malineni : రవితేజ(Raviteja) – గోపీచంద్ మలినేని కాంబినేషన్ సూపర్ హిట్ హ్యాట్రిక్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ప్రకటించారు. మైత్రి మేకర్స్ నిర్మాణంలో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో థమన్ సంగీత దర్శకుడిగా సినిమా ప్రకటించారు. ఈ సినిమాలో ఇందూజ అనే తమిళ్ హీరోయిన్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తారని కూడా ప్రకటించి సినిమా ఓపెనింగ్ కూడా చేశారు. దీంతో ఈ సినిమాపై ముందు నుంచే అంచనాలు నెలకొన్నాయి.

కానీ గత కొన్నాళ్లుగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటేస్తుండటంతో రవితేజకు అంత మార్కెట్ లేదని, ఏ ఓటీటీ కూడా సినిమాని కొనడానికి ఇంకా ముందుకు రాకపోవడంతో నిర్మాతలు ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాపై మరో వార్త టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Also Read : Allu Arjun : ‘హాయ్ నాన్న’ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. మరోసారి నానిపై పొగడ్తలు..

ఇదే కథని బాలీవుడ్ లో సన్నీ డియోల్(Sunny Deol) కి గోపీచంద్ తో మైత్రి నిర్మాతలు చెప్పించారని, సన్నీ డియోల్ ఒప్పుకున్నాడని, దీంతో ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో పాన ఇండియా వైడ్ బాలీవుడ్ సినిమాగా తెరకెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి నిజంగానే ఈ సినిమా ఆగిపోయిందా, గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ కి కథ చెప్పాడా? ఇక్కడ రవితేజని వదిలేసి బాలీవుడ్ కి వెళ్లి సినిమా తీస్తాడా అంటే ఎదురు చూడాల్సిందే. ఇటీవలే సన్నీ డియోల్ గదర్ 2 సినిమాతో వచ్చి భారీ విజయం సాధించి 500 కోట్లు కలెక్ట్ చేశాడు. గోపీచంద్ మలినేని కూడా ఇటీవల బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాతో హిట్ కొట్టాడు.