×
Ad

Ramabanam : రామబాణం ట్విట్టర్ రివ్యూ.. రామబాణం గురి తప్పిందా? తగిలిందా?..

ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల రామబాణం ప్రీమియర్ సినిమా షోలు పడ్డాయి. ఇప్పటికే సినిమా చూసేసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

  • Published On : May 5, 2023 / 10:03 AM IST

Gopichand Ramabanam Movie Twitter Review audience rating

Ramabanam :  గోపీచంద్(Gopichand), డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా నేడు మే 5న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది. సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్ తో రామబాణం కమర్షియల్ సినిమాతో పాటు ఓ మెసేజ్ కూడా ఇస్తున్నట్టు చెప్పేశారు.

ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల రామబాణం ప్రీమియర్ సినిమా షోలు పడ్డాయి. ఇప్పటికే సినిమా చూసేసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కొంతమంది సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉంది అంటుంటే మరికొంతమంది రొటీన్ కమర్షియల్ సినిమా అని అంటున్నారు. మరి గోపీచంద్ రామబాణం ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.