Ramabanam Movie: శ్రీరామనవమి స్పెషల్.. ‘రామబాణం’ వదిలిన గోపీచంద్, జగపతి బాబు

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

Gopichand Ramabanam Movie Update On Srirama Navami

Ramabanam Movie: మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. గోపీచంద్‌తో కలిసి గతంలో లక్ష్యం, లౌక్యం వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీవాస్ ముచ్చటగా మూడోసారి తెరకెక్కిస్తున్న సినిమా ‘రామబాణం’. దీంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి క్రేజ్ నెలకొంది.

Gopichand RamaBanam : గోపీచంద్ మొదటి బాణం అదిరిపోయింది.. రామబాణం ఫస్ట్ లుక్ టీజర్..

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, అది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇవాళ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో హీరో గోపీచంద్‌తో పాటు విలక్షణ నటుడు జగపతి బాబు కూడా కనిపించాడు. పంచె కట్టుకుని ఇద్దరు చేతులు పట్టుకుని వెళ్తున్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Ugadi : ఉగాది అప్డేట్స్, స్పెషల్ పోస్టర్స్ తో కళకళలాడిన టాలీవుడ్..

చూస్తుంటే ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో ఖుష్బూ గోపీచంద్ వదిన పాత్రలో నటిస్తోండగా, అందాల భామ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.