×
Ad

Gopichand : శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లి ఎవరు సెట్ చేశారో తెలుసా?

గోపీచంద్ భార్య రేష్మ హీరో శ్రీకాంత్ కి మేనకోడలు అవుతుందని అందరికి తెలిసిందే. అయితే వీరి పెళ్లి ఎలా జరిగిందో గోపీచంద్ అలీతో సరదాగా ప్రోగ్రాంలో తెలిపాడు.

  • Published On : March 14, 2024 / 10:18 AM IST

Gopichand said about how his Marriage happened with Srikanth Relative Reshma

Gopichand : మ్యాచో స్టార్ గోపీచంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలే భీమా(Bhimaa) సినిమాతో రాగా ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. భీమా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా ప్రోగ్రాంకి(Ali) రాగా ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

గోపీచంద్ భార్య రేష్మ హీరో శ్రీకాంత్(Srikanth)కి మేనకోడలు అవుతుందని అందరికి తెలిసిందే. హీరో శ్రీకాంత్ అక్క కూతురు రేష్మనే గోపీచంద్ పెళ్లి చేసుకున్నాడు. 2013లో వీరి పెళ్లి జరిగింది. అయితే వీరి పెళ్లి ఎలా జరిగిందో గోపీచంద్ అలీతో సరదాగా ప్రోగ్రాంలో తెలిపాడు.

Also Read : Chandini Chowdary : హీరోయిన్స్‌ని ఎవరూ ప్రశ్నలు అడగరు.. హీరోలని, డైరెక్టర్స్ నే అడుగుతారు.. చాందిని చౌదరి కామెంట్స్ వైరల్..

గోపీచంద్ మాట్లాడుతూ.. ఒకసారి రేష్మ ఫోటోని చూసాను. ఆమె శ్రీకాంత్ మేనకోడలు అని తెలిసింది. శ్రీకాంత్ నాకు అప్పటికే పరిచయం ఉన్నాడు. కానీ డైరెక్ట్ గా మాట్లాడి అడగలేను కదా, అందుకే చలపతి రావు అంకుల్(దివంగత నటుడు చలపతి రావు)కి ఈ విషయం చెప్తే ఆయనే శ్రీకాంత్ తో మాట్లాడి మా పెళ్లి సెట్ అయ్యేలా చేశారు. ఆయన దగ్గరుండి మాకు పెళ్లి చేసారు అని తెలిపారు. ఇక రేష్మ గోపీచంద్ కి ఫస్ట్ టైం ఓ టీ షర్ట్, గ్రీటింగ్ కార్డు గిఫ్ట్ గా ఇచ్చిందని కూడా తెలిపాడు.

గోపీచంద్ రేష్మ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అనేకమంది రాజకీయ నాయకులు కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం ఈ జంటకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.