Chandini Chowdary : హీరోయిన్స్‌ని ఎవరూ ప్రశ్నలు అడగరు.. హీరోలని, డైరెక్టర్స్ నే అడుగుతారు.. చాందిని చౌదరి కామెంట్స్ వైరల్..
గామి సినిమా చూసిన తర్వాత అందరూ చాందిని చౌదరిని అభినందిస్తున్నారు.

Chandini Chowdary Sensational Comments in Gaami Press Meet
Chandini Chowdary : తెలుగమ్మాయి చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ నుంచి ప్రయాణం మొదలుపెట్టి సినిమాలు, సిరీస్ లలో దూసుకుపోతుంది. కమర్షియల్ గుర్తింపు రాకపోయినా వరుసగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది. ఇటీవల ‘గామి'(Gaami) సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది చాందిని చౌదరి. విశ్వక్, చాందిని ముఖ్య పాత్రల్లో వచ్చిన గామి సినిమా మంచి విజయం సాధించి ఇప్పటికే 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
గామి సినిమాలో చాందిని చౌదరి లైఫ్ రిస్క్ పెట్టి మరీ నటించింది. హిమాలయాల్లో ఎన్నో కష్టాలు పడి గామి కోసం నిలబడింది. ఐదేళ్లు సాగినా ఈ సినిమాని నమ్మింది. సినిమాలో ఎన్నో రిస్కీ షాట్స్ కూడా చేసింది. గామి సినిమా చూసిన తర్వాత అందరూ చాందిని చౌదరిని అభినందిస్తున్నారు. తాజాగా గామి మూవీ టీం తిరుమలకు వెళ్లారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలోని ఓ థియేటర్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
Also Read : Kiran Abbavaram Rahasya Gorak : కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్ నిశ్చితార్థం ఫోటోలు చూశారా?
ఈ ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్ సేన్, చాందిని, డైరెక్టర్ పాల్గొన్నారు. అక్కడి మీడియా టీంని పలు ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. అయితే చాందిని చౌదరిని ఎవరూ సినిమా గురించి ప్రశ్నలు అడగలేదు. దీంతో చివర్లో చాందిని చౌదరి మాట్లాడుతూ సినిమా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఏంటో అందరూ హీరో, డైరెక్టర్స్ నే ప్రశ్నలు అడుగుతారు. లేడీ యాక్ట్రెస్ లని పట్టించుకోరు, ప్రశ్నలు అడగరు. నేను ఎప్పట్నుంచో ఇది చూస్తున్నాను, ప్రెస్ మీట్స్ లో లేడీ ఆర్టిస్టులని ప్రశ్నలు అడగరు అని కామెంట్స్ చేసింది. దీంతో వెంటనే ఓ మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న అడగ్గా మొహమాటానికి వద్దులెండి అని అనేసింది చాందిని. ఇక విశ్వక్.. ఈ ప్రెస్ మీట్ కంటే ఇప్పుడు చివర్లో నువ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతాయి అని సరదాగా అన్నాడు. దీంతో చాందిని చౌదరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.