Chiranjeevi : సంక్రాంతికి చిరు డబుల్ డోస్.!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన రెండు చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే టాక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- September 16, 2026 / 08:53 PM IST
Gossip garage Chiranjeevi Kaaka and Vishwambhara movies in 2027 Sankranthi Race
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న కాకా సినిమా షూటింగ్ స్పీడందుకుంది. రాబోయే సంక్రాంతి రేసులో కాకా సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు కన్ఫామ్ అయింది. అయితే లేటెస్ట్‌గా మరో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి నటించిన మరో చిత్రం విశ్వంభర కూడా సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విశ్వంభరకు సంబంధించిన ఓటీటీ డీల్ కూడా కుదిరినట్టుగా టాక్ వినిపిస్తుండటంతో, ఈ సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం మొదలైంది.
సాధారణంగా ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు ఒకే పండుగ సీజన్‌లో విడుదల కావడం చాలా అరుదు. దీంతో కాకా, విశ్వంభరలో ఏదో ఒక సినిమా తప్పుకుంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. రెండు సినిమాలనూ సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
Suriya-Jyotika : సూర్య, జ్యోతిక వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. ఫోటోలు
అదే నిజమైతే ఒకే సంక్రాంతికి మెగాస్టార్ సినిమాలు రెండూ థియేటర్లలో సందడి చేయడం, చిరంజీవి తనకు తానే బాక్సాఫీస్ పోటీ ఇవ్వడం ఆసక్తికర పరిణామంగా మారనుంది. విశ్వంభర కూడా సంక్రాంతి రేసులోకి వస్తుందో లేదో మూవీ యూనిట్ క్లారిటీ ఇస్తేనే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడనుంది.
