Game Changer : గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్ స్టోరీనా?
భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గేమ్‌ఛేంజర్ మూవీ.
- Thota Vamshi Kumar
- Published On : January 3, 2025 / 09:16 PM IST
Is Game Changer movie Pawan Kalyan Story
భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గేమ్‌ఛేంజర్ మూవీ. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో రామ్‌చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయ్యాలనుకుంటున్నారో అవే ఈ సినిమాలో హైలెట్ సీన్స్‌గా ఉండబోతున్నాయట. ట్రైలర్‌లో కనిపించిన చాలా సీన్స్ గతంలో పవన్ చేసిన పొలిటికల్ కామెంట్స్‌కు సింక్ అయ్యేలా ఉన్నాయంటున్నారు.
పవన్ పొలిటికల్ జర్నీని, విక్టరీని, ఫ్యూచర్ ప్లాన్‌ను గేమ్‌ఛేంజర్‌లో చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. బాబాయ్ రియల్ లైఫ్ రోల్‌నే అబ్బాయ్ వెండి తెరమీద చూపించబోతున్నారన్న న్యూస్ అయితే ఆసక్తికరంగా మారింది. ఓవైపు రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఇంకోవైపు పవన్ ఫ్యాన్స్ ఈ న్యూస్‌పై తెగ ఖుషీ అవుతున్నారు.
Dilruba Teaser : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ టీజర్ వచ్చేసింది..
ఇక రాజమండ్రిలో జరిగే గేమ్‌ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకాబోతున్నారు. గేమ్‌ఛేంజర్ సినిమా పొలిటికల్ బ్రాక్ డ్రాప్ మూవీ అవ్వటం పవన్ డైలాగ్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో మూవీపై, ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఇంకా ఆసక్తి రేపుతోంది. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజీ మీద రియల్ పొటిటీషియన్‌తో రీల్ పొలిటీషియన్ కనిపిస్తే పూనకాలే అంటున్నారు ఫ్యాన్స్.
