Dilruba Teaser : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ టీజర్ వచ్చేసింది..
కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ దిల్ రూబా.

Dilruba Teaser
ఇటీవల క మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ దిల్ రూబా. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో 10వ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అందులో భాగంగా టీజర్‌ను విడుదల చేశారు.
మ్యాగీ మై ఫస్ట్ లవ్ అని కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. మొత్తంగా టీజర్ అదిరిపోయింది. లవ్, యాక్షన్ సన్నివేశాలు అలరిస్తున్నాయి.