Janhvi Kapoor : అచ్చియమ్మ హర్ట్ అయ్యిందా.?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor ) పోషించిన అచ్చియమ్మ రోల్ హాట్ టాపిక్‌గా మారింది.

Gossip Garage Is Janhvi Kapoor hurt

Janhvi Kapoor : రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా థియేటర్స్‌లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక కేవలం సినిమా కథ, రామ్‌చరణ్ యాక్టింగ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ రోల్ హాట్ టాపిక్‌గా మారింది. జాన్వీ క్యారెక్టరైజేషన్‌పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

కథలో రోల్ ఇంపార్టెన్స్ కంటే..ఆమె గ్లామర్‌నే ఎక్కువగా చూపించినట్లు ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో జాన్వీ కపూర్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఆలోచనలో పడ్డట్లు టాక్. ఇప్పటికే ఆమె చేసిన దేవర, పెద్ది సినిమాల్లో ఆమె పాత్రలకు వచ్చిన టాక్ జాన్వీని కొంత నిరాశకు గురి చేసిందని అంటున్నారు. టాలీవుడ్‌లో తాను నటించిన రెండు సినిమాల్లోనూ ఆమెకు పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు రాకపోవడం, గ్లామర్‌కు మాత్రమే పరిమితమైపోయిందనే కామెంట్స్ రావడం జాన్వీని ఆలోచనలో పడేసినట్టుగా చెబుతున్నారు.

JR NTR : తొలిసారి కుకీస్ చేసిన ఎన్టీఆర్‌.. పంప‌మ‌ని అభిమాని అడిగితే.. షాకింగ్ రిప్లై..

పెద్ది సినిమాలో ఆమె పాత్రపై వస్తున్న నెగిటివ్ రియాక్షన్ కూడా ఆమెను హర్ట్ చేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మంచి కంటెంట్, బలమైన క్యారెక్టర్స్ లేకుండా కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చేసే పాత్రల కన్నా..సినిమాలే ఒప్పుకోకపోవడమే మంచిదని జాన్వీ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఇక నుంచి మంచి రోల్‌, పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న స్టోరీలను పిక్ చేసుకోవాలని అనుకుంటోందట జాన్వీ. పెద్ద స్టార్ హీరో, బిగ్ డైరెక్టర్‌ కాంబినేషన్ అని కాకుండా..తన పాత్రకు, నటనకు అవకాశం ఉంటేనే సినిమా చేయాలనుకుంటోందట. జాన్వీ మంచి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తుందా.? లేక ఇంకేదైనా కీలక డెసిషన్ తీసుకోబోతోందా అనేది హాట్ టాపిక్‌గా మారింది.