Raghava Lawrence : పాలిటిక్స్ కోసం సినిమాలకు రాఘవ లారెన్స్ గుడ్‌బై.!
ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- June 12, 2026 / 09:36 AM IST
Gossip Garage IS Raghava Lawrence goodbye to movies for politics
Raghava Lawrence : ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న విజయ్ పార్టీలోకి రాఘవ లారెన్స్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. మొదట జూన్ 11న ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా మృతి నేపథ్యంలో ఆయనకు గౌరవంగా ఆ ప్రకటనను జూన్ 12కి వాయిదా వేశారు.
ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో లారెన్స్ ఉన్నట్లు మరో వార్త వైరల్ అవుతోంది. సేవా కార్యక్రమాలు, ప్రజలతో దగ్గరగా ఉండే స్వభావం ఉన్న లారెన్స్‌కు పాలిటిక్స్ కొత్త కాదని ఆయన అభిమానులు అంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్ పార్టీ ద్వారా ప్రజాసేవలో మరింతగా ముందుకు వెళ్లాలని, ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Governor Review: ‘గవర్నర్’ మూవీ రివ్యూ.. 1991లో RBI గవర్నర్ ఏం చేశారు? అప్పుడు ఏం జరిగింది?
లోకేష్ కనగరాజ్ బ్యానర్‌లో బెంచ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న లారెన్స్..జూన్ 10తో తన షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఇక ఆయన నెక్స్ట్ టార్గెట్ పాలిటిక్సేనా అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. రాబోయే ఆరు నెలల్లో తిరుచ్చితో పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన మరో 5 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రానున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి సీటు నుంచి టీవీకే పార్టీ అభ్యర్థిగా రాఘవ లారెన్స్ బరిలోకి దిగబోతున్నారంటూ కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. విజయ్, లారెన్స్‌ల మధ్య ఉన్న దోస్తీనే ఇందుకు బలం చేకూరుస్తుంది.
