Governor Review: ‘గవర్నర్’ మూవీ రివ్యూ.. 1991లో RBI గవర్నర్ ఏం చేశారు? అప్పుడు ఏం జరిగింది?
1990-91లో ఉన్న RBI గవర్నర్ వెంకటరమణన్ చేసిన సంస్కరణలపై ఈ సినిమా తెరకెక్కింది.(Governor Review)
Governor Review
Governor Review: మనోజ్ బాజ్ పేయ్, నౌషద్ మొహమ్మద్ కుంజు, అదా శర్మ, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘గవర్నర్’. సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై విపుల్ అమృత్ లాల్ నిర్మాణంలో చిన్మయ్ మాండ్లేకార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గవర్నర్ సినిమా కేవలం హిందీలోనే జూన్ 12న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్ షోలు కూడా వేశారు.
కథ విషయానికొస్తే..
1990లో రమణన్(మనోజ్ బాజ్ పేయ్)ని అప్పటి ఫైనాన్స్ మినిష్టర్ RBI గవర్నర్ గా నియమిస్తాడు. ఆ పదవి వస్తుందనుకొని ఆశపడ్డ డిప్యూటీ గవర్నర్ CR నిరాశ చెంది రమణన్ ని గవర్నర్ గా స్వీకరించలేకపోతాడు. అప్పుడు జరిగిన అమెరికా – ఇరాక్ యుద్ధం వల్ల పెట్రోల్ రేటు పెరగడం, కొన్ని సరుకులు దొరకపోవడం, దిగుమతులు చేసుకునే వస్తువుల రేట్లు పెరగడంతో విదేశీ మారక నిల్వలు బాగా తగ్గిపోతాయి. ఇంకొన్ని రోజులు ఇదే కొనసాగితే దేశం దివాళా తీస్తుందని తెలుస్తుంది. దీంతో విదేశీ మారక నిల్వలు పెంచటానికి రమణన్, CR వేరువేరు ప్లాన్స్ చెప్తారు. రమణన్ అమెరికా సహాయం తీసుకొని లోన్ తీసుకుందామని గవర్నమెంట్ కి ప్రపోజల్ పెడతాడు. దాంతో అమెరికా ఓ సాయం అడుగుతుంది. అది బయటపడితే గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుందని సీక్రెట్ గా చేయమంటారు.
కానీ జర్నలిస్ట్ అదితి(అదా శర్మ) దాన్ని బయటపెట్టడం, విపక్షాలు గోలపెట్టడం జరుగుతాయి. అప్పుడే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చినా ఏదో ఒకటి చేసి రమణన్ కొంత విదేశీ మారక నిల్వలు తీసుకొస్తాడు. కానీ రూపాయి రేటు పడిపోవడం, మరికొన్ని పరిస్థితులతో ఇండియా దివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. రమణన్ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు కానీ ఫెయిల్ అవుతాడు. చివరికి ఓ డేరింగ్ నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ వద్దకు వెళ్తే మొదట ఒప్పుకున్నా రాజీవ్ గాంధీ చనిపోవడంతో అది ఆపేయమంటారు. మరి ఇండియా దివాళా తీయకుండా రమణన్ తీసుకున్న ఆ డేరింగ్ నిర్ణయం ఏంటి? డిప్యూటీ గవర్నర్ CR అతనికి సపోర్ట్ చేస్తాడా? గవర్నమెంట్ రమణన్ నిర్ణయాలను స్వాగతిస్తుందా? అమెరికా సపోర్ట్ చేయడానికి అడిగిన సాయం ఏంటి? ఇండియా ఆర్థికంగా నష్టపోకుండా రమణన్, అతని టీమ్ కలిసి తీసుకున్న సంస్కరణలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : 29 Movie Review : ’29’ మూవీ రివ్యూ.. అబ్బాయిలు కచ్చితంగా చూడాల్సిన సినిమా..
సినిమా విశ్లేషణ..
1990-91లో ఉన్న RBI గవర్నర్ వెంకటరమణన్ చేసిన సంస్కరణలపై ఈ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ రమణన్ పాత్ర, అతని ఫ్యామిలీతో మొదలయి అతను RBI గవర్నర్ గా ఛార్జ్ తీసుకోవడం, ఆఫీస్ లో జరిగే సంఘటనలు, దేశం దివాళా తీయబోతుందని తెలియడం, దేశాన్ని కాపాడటానికి అతను చేసే ప్రయత్నాలతో సాగుతాయి. ఇంటర్వెల్ కి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఆసక్తిగా దేశాన్ని కాపాడటానికి రమణన్ చేసే ప్రయత్నాలు, అప్పటి ప్రభుత్వ పరిస్థితులతో కాసింత థ్రిల్ తో సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ కొంత సాగదీశారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్ లో థ్రిల్ తో పాటు ఎమోషన్ కూడా బాగా పండింది. RBI గవర్నర్ కూతురు, ఫ్యూన్ కూతురు IAS పాస్ అయ్యే సీన్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే గోల్డ్ సీన్ చాలా ఉత్కంఠగా ఉంటుంది. RBI ఎలా పనిచేస్తుంది అనేది చూపించకపోయినా దేశానికి RBI ఎంత అవసరం, RBI గవర్నర్ పాత్ర ఏంటి అనేది బాగా చూపించారు.
అప్పటి నాయకులు, గవర్నమెంట్ ఆఫీసర్లు, ప్రభుత్వ పరిస్థితులు అన్ని పర్ఫెక్ట్ గా చూపించారు. నేను ఫెయిల్ అయితే RBI ఫెయిల్ అవుతుంది. RBI ఫెయిల్ అయితే ఇండియా ఫెయిల్ అవుతుంది.. లాంటి దేశభక్తి డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. ఇది ఒక ఫైనాన్సియల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఈ కంటెంట్ సినిమా కంటే కూడా వెబ్ సిరీస్ గా రాసుకుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది.
ఎక్కువగా బ్యాంక్ పదాలు, RBI కి సంబంధించిన మాటలతో సాగడంతో సాధారణ ప్రేక్షకులకు కొన్ని సీన్స్ అర్ధం కాకపోవచ్చు. కేవలం RBI కథగానే కాక మూడు ఫ్యామిలీల ఎమోషన్ ని కూడా కథలో ఇమిడిపోయేలా రాసుకొని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం బాగానే రీసెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. కానీ కమర్షియల్ గా ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో చూడాలి. ఇలాంటి చరిత్రలో జరిగిన సంఘటనలు ఇంకా సినిమాల రూపంలో వస్తే బాగుండు అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫారెన్స్..
RBI గవర్నర్ గా మనోజ్ బాజ్ పేయ్ చాలా నిదానంగా, సైలెంట్ గా ఉండే పాత్రలో తక్కువగా మాట్లాడే పాత్రలో కనిపించి నటనతో మెప్పిస్తాడు. CR పాత్రలో నౌషద్ మొహమ్మద్ కుంజు కూడా బాగా నటించారు. మధుబాల మనోజ్ భార్య పాత్రలో మెప్పిస్తుంది. జర్నలిస్ట్ గా అదా శర్మ బాగానే నటించింది. పరితోష్ సంధ్, ఫ్యూన్ పాత్ర చేసిన నటుడు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Makutam Teaser : విశాల్ ‘మకుటం’ టీజర్ వచ్చేసింది.. మూడు వేరియేషన్స్‌తో అదరగొట్టాడుగా..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ 1990 నాటి కాలాన్ని చూపించడానికి బాగా కష్టపడింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. దర్శకుడు చాలా రీసెర్చ్ చేసి ఈ కథని రాసుకొని తెరకెక్కించాడు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా కూడా కథకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘గవర్నర్’ సినిమాని 1990-91 సమయంలో RBI గవర్నర్ గా ఉన్న వెంకటరమణన్ ఇండియాని దివాళా తీయకుండా ఎలా కాపాడాడు అని ఫైనాన్షియల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
