Allu Arjun : రాజకీయాల్లోకి అల్లు అర్జున్?

అల్లు అర్జున్ (Allu Arjun ) పొలిటికల్ ఎంట్రీ.. గ‌త రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ టాక్ ఫుల్ వైరల్ అవుతోంది.

Gossip Garage Is That Allu Arjun political entry

Allu Arjun : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ.. గ‌త రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ టాక్ ఫుల్ వైరల్ అవుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో అల్లుఅర్జున్ సీక్రెట్‌ భేటీ అయ్యారని..తెలంగాణ లేదా ఏపీలో కొత్త పార్టీ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడని పోస్టులు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

కొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తే రాణిస్తారా లేదా అనే డిబేట్లు కూడా స్టార్ట్ చేశాయి. ప్లాన్ రెడీ..ఎంట్రీనే లేటు అన్నట్లుగా ఎవరికి తోచింది వారు రాసేస్తున్నారు కూడా. కానీ ఇప్పటివరకు అల్లుఅర్జున్ గాని, ప్రశాంత్ కిషోర్ గాని ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇదంతా సోషల్ మీడియా క్రియేట్ చేసిన హైప్ మాత్రమేనని అంటున్నారు.

Love Oh Love Review : ‘లవ్ ఓ లవ్’ మూవీ రివ్యూ.. అబ్బాయిలు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి..

ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తమిళనాడులో హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, అదే మోడల్‌ను తెలుగు స్టార్లకు అప్లై చేస్తూ కొందరు సోషల్ మీడియాలో స్టోరీస్‌ క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బ్యాక్‌ ఎండ్‌లో ఉండి..బన్నీ పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ముందుగా స్ట్రాటజీ సెట్ చేసి తర్వాత అల్లుఅర్జున్‌ను ఫీల్డ్‌లోకి దించే ప్లాన్ చేస్తున్నాడని గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

గతంలో కూడా అల్లుఅర్జున్ రాజకీయాల్లోకి వస్తాడన్న వార్తలను ఆయన టీమ్ పూర్తిగా బేస్‌లెస్ అని కొట్టిపారేసింది. ఇప్పుడు మరోసారి బన్నీ పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి లీడ్ ఏంటో తెలియదని కానీ..ఇది నెట్టింట ట్రెండింగ్ టాపిక్‌గా నడుస్తోంది.