Prabhas : మరోసారి రాముడిలా ప్రభాస్..?
ప్రభాస్ ఇప్పుడు మరోసారి రాముడిలా కనిపించబోతున్నాడా అంటే (Prabhas) అదే డిస్కషన్ నడుస్తోంది ఫిల్మ్‌నగర్‌లో !
- Thota Vamshi Kumar
- Published on- August 14, 2026 / 08:13 AM IST
Gossip Garage Prabhas as Lord Rama once again
Prabhas : బాహుబలి మహారాజులా.. కల్కిలో కర్ణుడిలా.. కన్నప్పలో రుద్రుడిలా.. ప్రభాస్ స్థాయే వేరు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు మరోసారి రాముడిలా కనిపించబోతున్నాడా అంటే.. అదే డిస్కషన్ నడుస్తోంది ఫిల్మ్‌నగర్‌లో ! హనుమ్యాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇందులో రాముడి పాత్ర కోసం.. ప్రభాస్‌ను తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడట. దీనికోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
జై హనుమాన్‌లో హనుమంతుడిగా రిషబ్ శెట్టి కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రకు కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉన్న స్టార్‌ను చూపించాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే.. ప్రభాస్ పేరు తెరపైకి వచ్చిందని టాక్. ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్, మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని.. శ్రీరాముడిగా ఆయనను చూపిస్తే సినిమాకు భారీ హైప్ వస్తుందని ప్రశాంత్ వర్మ టీమ్ భావిస్తున్నట్లు టాక్.
Shriya Saran : రష్యాలో ఉదయాన్నే ఇలా.. భర్త, కూతురితో శ్రియా శరణ్ ఫోటోలు..
ఇప్పటికే ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించాడు. ఐతే ఆ సినిమాలో ప్రభాస్ లుక్, పాత్రను ప్రజెంట్ చేసిన విధానంపై.. అప్పట్లో భారీగా విమర్శలు వచ్చాయ్. దీంతో ఈసారి ప్రభాస్‌ను శ్రీరాముడిగా చూపిస్తే మాత్రం పూర్తిగా భిన్నమైన, మరింత గంభీరమైన, దైవత్వం కనిపించే లుక్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ వర్మ ఆలోచిస్తున్నారట. మరి జై హనుమాన్‌లో ప్రభాస్ కేవలం గెస్ట్ అప్పియరెన్స్ తరహాలో కనిపిస్తారా.. లేక కథలో కీలకమైన పాత్రగా ఉంటారా అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
ఐతే రాముడిగా ప్రభాస్‌ను మరోసారి చూపించి.. గతంలో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, ఆ పాత్రలో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించాలనే టార్గెట్‌తో ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి ఈ వార్త నిజమై ప్రభాస్, రిషబ్ శెట్టి కాంబినేషన్ తెరపై కనిపిస్తే మాత్రం.. జై హనుమాన్ పై అంచనాలు ఆకాశానికి చేరడం ఖాయం.
