Mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీ.. రంగంలోకి సందీప్ రెడ్డి వంగా?
నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ (Mokshagna) వెండితెర అరంగేట్రం ఎప్పుడు.? కొన్నాళ్లుగా ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉంది.
- Thota Vamshi Kumar
- Published on- July 12, 2026 / 10:35 AM IST
Gossip Garage Sandeep Reddy Vanga for Nandamuri Mokshagna
Mokshagna : నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం ఎప్పుడు.? కొన్నాళ్లుగా ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉన్న ఎపిసోడ్. గతంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ప్రకటించారు. ఆ ప్రాజెక్టు ఏమైందో తెలియదు కానీ..చర్చల స్థాయిలోనే ఆగిపోయింది. దీంతో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఎప్పుడనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అయితే మోక్షజ్ఞ లాంఛింగ్ బాధ్యతలను బాలకృష్ణనే భుజానకెత్తుకున్నారట.
నందమూరి బ్రాండ్‌కు తగ్గట్టుగా, బాలయ్యే ఒక పవర్‌ఫుల్ లైన్‌ను సిద్ధం చేసి, స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. బాలకృష్ణ సిద్ధం చేసిన కథపై.. సందీప్ రెడ్డి వంగా తనదైన బోల్డ్ అండ్ రియలిస్టిక్ స్టైల్‌కు తగ్గట్టుగా రీవర్క్ చేస్తున్నారట. క్యారెక్టర్ డిజైన్ నుంచి ఎమోషనల్ డెప్త్ వరకు ప్రతిదాన్ని కొత్తగా మలుస్తూ, మోక్షజ్ఞ ఎంట్రీని నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Sai Dhanshika : హీరో విశాల్‌కు కాబోయే భార్య.. చీరకట్టులో ఎంత క్యూట్‌గా ఉందో..
యూత్‌ను టార్గెట్ చేసేలా స్టోరీలో ఇంటెన్స్ ఎలిమెంట్స్ జోడిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం డెబ్యూ మూవీలా కాకుండా, మోక్షజ్ఞకు బలమైన గుర్తింపు తెచ్చేలా లాంచ్‌ప్యాడ్‌గా మార్చాలని టీమ్ భావిస్తున్నట్టుగా టాక్. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, టైమ్ తీసుకుని పక్కాగా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే మోక్షజ్ఞ మూవీ, సందీప్‌రెడ్డి వంగా ప్లానింగ్‌పై అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ కాంబినేషన్‌పై జరుగుతున్న ప్రచారం మాత్రం ఓ రేంజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
