Grandson Devaansh questions Chandrababu answers viral
ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతోంది. తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అతిథిగా వచ్చారు. రాజకీయాలు, ఫ్యామిలీ, జైలు జీవితం వంటి ఎన్నో విషయాల గురించి చంద్రబాబు మాట్లాడారు. ఇక ఈ షోలో మనవడు దేవాంశ్ తెరపై కనిపించి చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగారు.
మీరు రాజకీయాల్లో బిజీగా ఉంటారు కదా.. తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు అని ప్రశ్నించారు. ‘నువ్వు టైం ఇస్తే నీతో ఆడుకుంటూ రిలాక్స్ అయ్యేవాడిని. కానీ నువ్వు టైం ఇవ్వట్లేదు కదా? నువ్వు ఎప్పుడూ లెక్కలతో కుస్తీ పడుతుంటావు అది బోర్ కొడితే సైన్స్ చదువుతూ రిలాక్స్ అవుతావు. నాకు కూడా నేను చేస్తున్న పని మార్చుకుంటే రిలాక్స్ వస్తుంది.’ అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే.. కనిపించదు. అదేంటి? అని దేవాంశ్ ఓ పొడుపు కథను అడిగారు. భవిష్యత్తు అని చంద్రబాబు చెప్పారు. చిన్నప్పుడు మీరు చేసిన మోస్ట్ అల్లరి పనేంటి ? అని దేవాంశ్ మరో ప్రశ్న అడిగారు. అప్పుడు బాలయ్యను ఉద్దేశించి కాలేజీ రోజుల్లో నీ చిలిపి చేష్టల గురించి తెలిసి ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నట్లుగా ఉన్నాడు అని చంద్రబాబు అన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు.
వీడు తెలిసి అడుగుతున్నాడో, తెలియక అడుగుతున్నాడో గానీ పొలిటీషియన్ అవుతాడేమోనని నా డౌట్’ అని బాలయ్య అన్నారు.