Shaakuntalam : శాకుంతలంలో లాస్ట్ 15 నిమిషాలు అల్లు అర్హ యాక్టింగ్.. గుణశేఖర్!
గుణశేఖర్ డైరెక్షన్ లో సమంత (Samantha) నటిస్తున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం' (Shaakuntalam). ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అర్హ (Allu Arha) ప్రిన్స్ ‘భారత’ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో అర్హ పాత్ర గురించి గుణశేఖర్ మాట్లాడుతూ..
- gum 95921
- Published On : March 29, 2023 / 03:16 PM IST
Gunasekhar coments on Allu Arjun daughter Arha role in Shaakuntalam
Shaakuntalam : డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). హిందూ పురాణాల్లోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంతో మైథలాజికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. టైటిల్ రోల్ శకుంతల పాత్రలో సమంత (Samantha), దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అర్హ (Allu Arha) ప్రిన్స్ ‘భారత’ పాత్రలో నటిస్తుంది. ఇక ఈ మూవీ థియేటరికల్ ట్రైలర్ ఇప్పటికే ఆడియన్స్ ముందుకు వచ్చి సినిమా పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా 3D ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్ లో జరిగింది.
Chiranjeevi : అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చిరు ఎమోషనల్ పోస్ట్!
ఈ కార్యక్రమానికి గుణశేఖర్, నీలిమ గుణ, దిల్ రాజు, సాయి మాధవ్ బుర్రా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే గుణశేఖర్ అల్లు అర్హ, అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. ఈ సినిమాలో భరతుడి పాత్ర చాలా ముఖ్యమైంది. దీంతో ఆ పాత్రని ఎవరన్నా స్టార్ కిడ్ నటిస్తే బాగుంటుంది అని అనుకున్నాం. అందుకోసం వెతుకుతున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్ లో అల్లు అర్హ ఫోటోలు చూశాము. తానైతే బాగుంటుంది అనిపించి అల్లు అర్జున్ ని సంప్రదించాం. అల్లు అర్జున్ వెంటనే ఓకే చెప్పేశాడు.
కరోనా సమయంలో కూడా తన కూతురిని షూటింగ్ కి పంపించాడు అల్లు అర్జున్. గతంలో నా రుద్రమ్మదేవి సినిమాలో కూడా నటించి చాలా హెల్ప్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు. అల్లు అర్జున్ యాక్టర్ గానే కాదు వ్యక్తిగా కూడా చాలా ఉన్నతమైన వాడు, అందుకనే అందరికి ఐకాన్ స్టార్ అయ్యాడు. తనకి తెలుగు భాష పై ఎంతో మమకారం ఉంది. తన కూతురు అర్హ కూడా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ సినిమా అర్హ పాత్ర క్లైమాక్స్ కి ముందు వస్తుంది. లాస్ట్ 15 నిమిషాలు అర్హ.. నటనలో అల్లు అర్జున్ ని దించేసింది అంటూ ప్రశంసించాడు.
