Shaakuntalam : శాకుంతలం కోసం.. ఏకంగా అన్ని కోట్లు పెట్టి రియల్ నగలా??.. ఒక్క సమంతకే 15 కిలోల బంగారం..

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో దర్శకుడు గుణశేఖర్ ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపాడు. శాకుంతలం సినిమాలో సమంతకు, మరికొంతమందికి నిజమైన బంగారు, వజ్రాల నగలు వాడామని చెప్పి, వాటి విలువ కోట్లలో ఉంటుందని..........................

Shaakuntalam : శాకుంతలం కోసం.. ఏకంగా అన్ని కోట్లు పెట్టి రియల్ నగలా??.. ఒక్క సమంతకే 15 కిలోల బంగారం..

shaakuntalam movie ornaments prepared with real gold and diamonds worth 14 crores

Shaakuntalam :  మయోసైటిస్ తగ్గిన తర్వాత సమంత ఇటీవలే మళ్ళీ బిజీ అయింది. వరుస సినిమాలు షూటింగ్స్ చేస్తూ మరో పక్క రాబోయే సినిమాలకు ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. త్వరలో సమంత శాకుంతలం సినిమాతో రాబోతుంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నారు. మన పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా, మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే కావ్యం నుంచి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. ఈ సినిమాకి గుణశేఖర్ కూతురు నీలిమ గుణ, దిల్ రాజులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

శాకుంతలం సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కావడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో దర్శకుడు గుణశేఖర్ ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపాడు. శాకుంతలం సినిమాలో సమంతకు, మరికొంతమందికి నిజమైన బంగారు, వజ్రాల నగలు వాడామని చెప్పి, వాటి విలువ కోట్లలో ఉంటుందని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో శకుంతల, దుశ్యంతుడు ధరించిన బంగారు, వజ్రాభరణాలను హైదరాబాద్ లోని వసుంధర జ్యుయెలరీస్ లో ప్రదర్శించారు. వీటిని ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా తయారుచేసింది.

ఈ ప్రెస్ మీట్ లో గుణశేఖర్ మాట్లాడుతూ.. శాకుంతలం సినిమా కోసం 14 కోట్ల రూపాయల విలువ చేసే నిజమైన బంగారు, వజ్రాభరణాలు వాడాము. దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితోనే ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ కి నిజమైన బంగారం, వజ్రాలతో తయారు చేయించిన ఆభరణాలనే వినియోగించాము. డిజైనర్ నీతు లుల్లా సారథ్యంలో వసుంధర జ్యుయెలరీస్ శాకుంతలం కోసం 6 నుంచి 7 నెలలు కష్టపడి ఆభరణాలను తయారుచేసింది. ఇందులో చాలా వరకు పూర్తిగా చేతితోనే తయారుచేశారు. ఈ ఆభరణాలు నా పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకొచ్చాయి. ఒక్క శకుంతల పాత్ర కోసమే 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేశాము. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారంతో ఆభరణాలు, మేనక పాత్ర మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను తయారుచేశాము అని తెలిపారు.

Chandrabose : ఆస్కార్ తో ఇండియాలో అడుగు పెట్టిన చంద్రబోస్..

సినిమాలో నిజం ఆభరణాలు వాడామని, కిలోల కొద్దీ బంగారం వాడామని, ఏకంగా కోట్లు ఖర్చు చేశామని గుణశేఖర్ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ నగలతో సమంత, మిగిలిన టీం సినిమాలో క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.