×
Ad

Euphoria Trailer: గుణశేఖర్ ‘యుఫోరియా’ ట్రైలర్ విడుదల.. అంచనాలు పెంచుతున్న ఇంటెన్స్ విజువల్స్

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘యుఫోరియా’ ట్రైలర్(Euphoria Trailer) విడుదల అయ్యింది.

Gunasekhar Euphoria movie trailer released.

  • గుణశేఖర్ కొత్త మూవీ యుఫోరియా
  • దురంధర్ ఫేమ్ సరే అర్జున్ ప్రధాన పాత్రలో యుఫోరియా
  • అంచనాలు పెంచుతున్న ట్రైలర్

Euphoria Trailer: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘యుఫోరియా’. దురంధర్ మూవీ ఫేమ్ సారా అర్జున్‌ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో భూమిక చావ్లా, గౌతమ్ మీనన్, నాజర్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్(Euphoria Trailer) విడుదల చేశాడు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన‌ ఒక భారీ ఈవెంట్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Danush: మరో కొత్త రోల్ లో ధనుష్.. సంక్రాంతి కానుకగా టీజర్ విడుదల.. టైటిల్ ఏంటో తెలుసా?

ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు గుణశేఖర్. ట్రైలర్ లో ఆ ఎలిమెంట్స్ ను ఎక్కువగా చూపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా చాలా ఇంటెన్స్ గా ఉండనుందని క్లియర్ గా అర్థమవుతోంది. అమ్మాయిలపై రేప్ అటెంప్ట్స్, మైనర్ క్రైమ్స్, పోక్సో ఇలా చాలా కరెంట్ టాపిక్స్ ను తీసుకున్నారు.

వాటి తాలూకు షాట్స్ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇక ఈ ఒక్క ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇక గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి శాకుంతలం లాంటి పాన్ ఇండియా డిజాస్టర్ తరువాత గుణశేఖర్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.