మీరు ఆర్మీ అయితే నేను పైలెట్ కాకూడదా? జాహ్నవి ప్రశ్నిస్తోంది..

ఇండియన్ సినీ ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ హవా కొసాగుతుంది. అదే కోవలో రూపొందిన మరో బయోపిక్ ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’. మన దేశానికి చెందిన తొలి మహిళా ఐ.ఎ.యఫ్ ఫైలట్ ఆఫీసర్ జీవితగాథ. కార్గిల్ యుద్ధంలో ఆమె అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆమెకు శౌర్య చక్ర అవార్డునిచ్చి సత్కరించింది. కార్గిల్ గర్ల్‌గా పేరు పొందిన గుంజన్ సక్సేనా పాత్రలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించారు. శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం చిత్ర విడుదల చేశారు.
కేవలం పురుషులు మాత్రమే పైలెట్స్ కాగలరు అని భావిస్తున్న తరుణంలో గుంజన్ సక్సేనా పైలట్ ఎందుకు కావాలనుకుంది? పైలట్ అయ్యే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఆమె సవాళ్లను అధిగమించి దేశానికి ఎలా సేవ చేసింది? అనే విషయాలను సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ప్రస్తుతం థియేటర్స్ మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో పలు చిత్రాలు డిజిటల్ మాధ్యమాల్లో నేరుగా విడుదలయ్యాయి. ఆ క్రమంలో ‘గుంజన్ సక్సేనా’ కూడా Netflix లో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 12న స్ట్రీమింగ్ కానుంది.