Gurthimpu : స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా.. ‘గుర్తింపు’ ఫస్ట్ లుక్ రిలీజ్..
కేజేఆర్ హీరోగా తెన్‌పతియాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుర్తింపు.
- Thota Vamshi Kumar
- Published On : May 24, 2025 / 09:40 AM IST
Gurthimpu First look out now
కేజేఆర్ హీరోగా తెన్‌పతియాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుర్తింపు. స్వస్తిక్ విజన్స్ సమర్పణలో గంగా ఎంటర్టైన్మెంట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి, తన కలల్ని నెరవేర్చుకునేందుకు క్రీడా రంగంలో ఎదిగిన తీరు, క్రీడా రంగంలో గుర్తింపు కోసం పడిన శ్రమ, చేసిన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 85 శాతం చిత్రీకరణ పూర్తి అయినట్లు వెల్లడించారు.
Arjun Ambati : బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి రొమాంటిక్ సాంగ్ చూశారా?
ఈ చిత్రంలో కేజేఆర్, సింధూరి విశ్వనాథ్, విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్, రమా, మోహన్ రామ్, ఆంటోనీ, అజిత్ ఘోషి, విమల్, ఇజబెల్లా, షాన్, దీపిక, జానకి, అరుల్ జ్యోతి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
