Arjun Ambati : బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి రొమాంటిక్ సాంగ్ చూశారా?
అర్జున్ అంబటి ఇప్పుడు 'పరమపద సోపానం' అనే సినిమాతో రాబోతున్నాడు.

Arjun Ambati Paramapadha Sopanam Movie Song Released
Arjun Ambati : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే అర్ధనారీ, తెప్పసముద్రం, వెడ్డింగ్ డైరీస్.. లాంటి సినిమాలతో మెప్పించిన అర్జున్ అంబటి ఇప్పుడు ‘పరమపద సోపానం’ అనే సినిమాతో రాబోతున్నాడు.
SS మీడియా బ్యానర్ పై గిడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాణంలో పూరి జగన్నాధ్ శిష్యుడు నాగశివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. పరమపద సోపానం సినిమా జూలై 11న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టి ఈ సినిమా నుంచి ‘చిన్ని చిన్ని తప్పులేవో..’ అంటూ సాగే రొమాంటిక్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు.
Also Read : Oka Brundavanam : ‘ఒక బృందావనం’ మూవీ రివ్యూ.. హృదయాన్ని హత్తుకునే సినిమా..
మీరు కూడా అర్జున్ అంబటి రొమాంటిక్ సాంగ్ చూసేయండి..
డేవ్ జాండ్ సంగీత దర్శకత్వంలో రాంబాబు గోశాల ఈ పాటను రాయగా పృథ్వీ చంద్ర, అదితి బావరాజు పాడారు.